లేడీస్ కప్పు కొట్టే వరకూ రిలీజ్ గుర్తు రాలేదా?
భారత దిగ్గజ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం అధారంగా రూపొందిన చిత్రమిది. ఇందులో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా షూటింగ్ కొన్ని సంవత్సరాల క్రితమే పూర్తయింది.
By: Sivaji Kontham | 9 Nov 2025 12:30 PM ISTబాలీవుడ్ లో క్రికెట్ నేపథ్యంలో చాలా మంది బయోపిక్స్ తెరపైకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా భారత్ జట్టుకున్న క్రేజ్ నేపథ్యంలో ఆ బయోపిక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటిలో కొన్ని కమర్శియల్ గా సక్సెస్ అయ్యాయి ..మరికొన్ని కాలేదు. కానీ క్రికెట్ నేపథ్యంలో కథ చెబుతున్నారంటే? ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ మహిళా క్రికెటర్ల జీవితాలు మాత్రం అలాంటి క్రేజ్ కు నోచుకోలేదు అన్నది అంతే వాస్తవం. తాజాగా బాలీవుడ్ వ్యవహరించిన తీరుతో? ఆ సంగతి మరోసారి తేటతెల్లమవుతోంది.
మరుగున పడిన ప్రాజెక్ట్ కి మోక్షం:
ఇటీవలే దక్షిణాప్రికాను చిత్తు చేసి తొలిసారిగా భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ సాధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ రికార్స్డ్ లో భారత జట్టు సరికొత్త చరిత్రను రాసింది. దీంతో మహిళల క్రికెట్ జట్టుకు ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. మహిళల క్రికెట్ గురించి ఎప్పుడూ ప్రచారం చేయని తెలుగు మీడియా కూడా ఎంతో గొప్పగా చెప్పడం మొదలు పెట్టింది. విజయానికి ఉన్న గొప్పదనం అలాంటిదని ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలో మరుగున పడిన `చక్ దే ఎక్స్ ప్రెస్` బూడిద దులిపే పని పెట్టుకుంది బాలీవుడ్.
రిలీజ్ కోసం సంప్రదింపులు:
భారత దిగ్గజ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం అధారంగా రూపొందిన చిత్రమిది. ఇందులో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా షూటింగ్ కొన్ని సంవత్సరాల క్రితమే పూర్తయింది. కానీ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. అయితే భారత మహిళల జట్టు కప్ కొట్టడంతో ఇప్పుడు ఈ బయోపిక్ ను రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ కు సంబంధించి నిర్మాతలు నెట్ ప్లిక్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. అదీ నెట్టింట నెటి జనులు కోరడంతో పూనుకోవడం విశేషం.
సినిమాతో వేగంగా:
లేదంటే ఈ బయోపిక్ ఎప్పటికీ అలా మరుగున పడే ఉండేది. భారత మహిళల జట్టు కప్ గెలవకపోయినా? నెటి జనులు రిలీజ్ చేయండని కోరకపోయినా? సదరు నిర్మాతలు పట్టించుకునే వారు కాదని మరో వర్గం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. క్రికెట్ లో లెజెండ్ గా ఎదిగిన వారి జీవిత కథల్ని రిలీజ్ చేసినప్పుడే మహిళల్లో మరింత చైతన్యం వస్తుంది. మరింత మంది మహిళా క్రికెటర్లను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. యువతపై సినిమాల ప్రభావం ఏ స్థాయిలో ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. మంచి అయినా? చెడు అయినా సినిమా ద్వారా యువ తలోకి వేగంగా వెళ్తోన్న సంగతి తెలిసిందే.
