అప్పుడు వేశ్య, ఇప్పుడు దేవిక... ఈమె చాలా స్పెషల్
సెన్సార్ బోర్డ్ సభ్యులను సైతం భయపెట్టిందని, హర్రర్ సీన్స్‌కి సెన్సార్ పడిందంటూ ప్రచారం జరగడంతో '418' సినిమాపై అంచనాలు పెరిగాయి.
By: Ramesh Palla | 25 Oct 2026 12:21 PM ISTసెన్సార్ బోర్డ్ సభ్యులను సైతం భయపెట్టిందని, హర్రర్ సీన్స్‌కి సెన్సార్ పడిందంటూ ప్రచారం జరగడంతో '418' సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు కన్నడంలో నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొని, ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి హర్రర్ మూవీ రాలేదు అనే విధంగా స్పందన దక్కించుకుంది. ఈమధ్య కాలంలో హర్రర్ సినిమా అనగానే కామెడీ గుర్తుకు వస్తుంది. హర్రర్ మాత్రమే ఉన్న సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి హర్రర్ సినిమాగా 418 రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సెకండ్ హాఫ్ కాస్త లో అవుతుంది అనిపించిన సమయంలో వచ్చిన దేవిక అనే పాత్ర మొత్తం సినిమా స్థాయిని పైకి లేపింది అంటూ రివ్యూస్ వచ్చాయి.
చైత్ర జే ఆచార్ హీరోయిన్గా 418 మూవీ...
ఈ సినిమాలోని అత్యంత కీలకమైన దేవిక పాత్రను కన్నడ ముద్దుగుమ్మ చైత్ర జే ఆచార్ చేసింది. ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఈమె చాలా సినిమాల్లో నటించినా రెండు మూడు సినిమాలు మినహా ఈమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. సప్త సాగరాలు దాటి సినిమాలో వేశ్య పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా అందంగా కనిపించడంతో పాటు, వేశ్య బాడీ లాంగ్వేజ్‌ను సరిగ్గా మ్యాచ్ చేస్తూ యాక్టింగ్ చేయడం వల్ల ఆ సమయంలో ఈమె గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఆ సినిమా తెలుగులోనూ విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో చైత్రకి ఇక్కడ కూడా గుర్తింపు లభించింది. అయితే లక్ కలిసి రాకపోవడంతో టాలీవుడ్ నుంచి ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు.
సప్త సాగరాలు దాటి సినిమాతో కన్నడంలో...
కన్నడంలోనే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సప్త సాగరాలు దాటి సినిమాలో చేసిన సురభి అనే వేశ్య పాత్ర స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించినప్పటికీ మెయిన్ హీరోయిన్ కంటే మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో లీడ్ రోల్ లో కనిపించినా పెద్దగా సత్తా చాట లేక పోయింది. ఆమెకు ప్రతిభ కనబర్చే పాత్రలు దక్కలేదు. మళ్లీ ఇన్నాళ్లకు 418 సినిమాలోని దేవిక పాత్రతో చైత్రకు తన పూర్తి ప్రతిభ చూపించే అవకాశం దక్కింది. సినిమాలోని ఆ పాత్ర ప్రాధాన్యత, ఆ పాత్రకు తగ్గట్లుగా చైత్ర యాక్టింగ్ చేసిన విధానంకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అద్భుతంగా నటించిందని, సినిమాలో చైత్ర కాకుండా దేవికను మాత్రమే చూసినట్టు అనిపించింది అని ప్రేక్షకులు, విశ్లేషకులు సినిమాను చూసిన తర్వాత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్లో స్పెషల్ హీరోయిన్గా చైత్ర...
చైత్ర గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇంత ప్రతిభావంతురాలైన చైత్రకు ఎందుకు ఆఫర్లు పెద్దగా రావడం లేదు అంటూ కొందరు చర్చ మొదలు పెట్టారు. వచ్చిన సినిమాల్లో కూడా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదు. ఆమె నటన ప్రతిభను వాడుకునే దర్శకులు తక్కువ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ చైత్ర జే ఆచార్ చాలా స్పెషల్ అని మరోసారి 418 సినిమాతో నిరూపితం అయ్యింది అని ఆమె అభిమానులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోయిన్స్ లో ఎక్కువగా అందం చూపించడం తప్ప నటించడం రావడం లేదని, కానీ అందంతో పాటు చైత్ర యాక్టింగ్‌తోనూ ఆకట్టుకుంటుందని, అందుకే ఈ స్పెషల్ బ్యూటీకి మరిన్ని దేవిక, సురభి వంటి పాత్రలు రావాలని చైత్రతో చేయించాలని ఫ్యాన్స్ ఫిల్మ్ మేకర్స్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మీదట అయినా చైత్రకు తన ప్రతిభకు తగ్గ సినిమా ఆఫర్లు వరుసగా వస్తాయా అనేది చూడాలి.
