క్లిక్ క్లిక్ : చైతూ-శోభిత జంటగా
టాలీవుడ్ యంగ్ స్టార్ నాగ చైతన్య, హీరోయిన్ శోభిత జోడీ ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి.
By: Ramesh Palla | 27 Sept 2025 4:39 PM ISTటాలీవుడ్ యంగ్ స్టార్ నాగ చైతన్య, హీరోయిన్ శోభిత జోడీ ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఫోటోలు వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. నాగ చైతన్య, శోభిత పెళ్లి అయినప్పటి నుంచి విదేశాలకు వెళ్లడం, పలు కార్యక్రమాల్లో పాల్గొనడం మనం చూస్తూనే ఉంటాం. ఆయా సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో ఆ ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అక్కినేని దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. గతంలో నాగ చైతన్య పలు సార్లు ఇలాంటి మాల్స్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అయితే ఈసారి మరింత స్పెషల్‌గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నాగ చైతన్య, శోభిత జంటగా..
హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆర్‌ఎస్ బ్రదర్స్ షో రూంను నాగ చైతన్య, శోభితలు సందర్శించారు. ఆ సమయంలో జనాలు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. స్థానికంగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కినేని ఫ్యాన్స్ వనస్థలిపురంకు చేరుకున్నారు. అభిమానులను ఉద్దేశించి నాగ చైతన్య అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. నాగ చైతన్య ను చూడాలని చాలా దూరం నుంచి వచ్చామని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. ఆర్‌ఎస్ బ్రదర్స్ మాల్‌ను సందర్శించిన సమయంలో చైతూ, శోభిత ధరించిన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. రెడ్ సారీలో శోభిత చాలా అందంగా కనిపించింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను ధరించిన శోభిత సింపుల్ హెయిర్ స్టైల్‌తో నుదుట బొట్టు ధరించడంతో పాటు, అంతకంటే సింపుల్ నగలను ధరించి పక్కా గృహిణి మాదిరిగా చాలా అందంగా ఉందని అంతా కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ ఆర్‌ఎస్ బ్రదర్స్‌లో అక్కినేని జంట
ఇక నాగ చైతన్య ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరు అయినట్లుగా కుర్తీ ధరించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా నాగ చైతన్యను ఇలా చూడటం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నాగ చైతన్య ను ఇలా సోషల్ మీడియాలో చూసి చాలా మంది అలాగే ఉండి పోతున్నారు. సాధారణంగా నాగ చైతన్యను ఇలాంటి లుక్‌లో సినిమాలో చూస్తూ ఉంటాం. కానీ నాగ చైతన్య ఇలా మాల్ కి ఇలాంటి ఔట్ ఫిట్ లో రావడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వీరిద్దరి జోడీ మొదటి నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్స్ లో వీరిద్దరూ ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇంత అందంగా ఉండటం వల్లే కెమెరా మెన్స్ వీరి ఫోటోలను తీసేందుకు తెగ పోటీ పడ్డారు.
తండేల్ తర్వాత చైతూ కొత్త సినిమా
నాగ చైతన్య ఇటీవల తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చైతూ కెరీర్‌లో సోలో రూ.100 కోట్ల సినిమాను దక్కించుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా వచ్చిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తదుపరి సినిమా విషయంలో చాలా ఆసక్తిగా అంతా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ప్రస్తుతం సినిమాను చేస్తున్నాడు. ఎన్‌సీ24 అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ సహ నిర్మాతగా వ్యవహరించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
