ముంబైలో పుట్టినా హాట్ బ్యూటీ మనసంతా గోవాలోనే!
చాహత్ ఖన్నా బాలీవుడ్ -టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి.
By: Srikanth Kontham | 11 Aug 2026 1:12 PM ISTచాహత్ ఖన్నా బాలీవుడ్ -టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి. అమ్మడు ప్రధానంగా టెలివిజన్ ధారావాహికలలో నటించినా?`థాంక్ యూ` వంటి కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించారు. 2005లో రిలీజ్ అయిన `ద రియల్ లైఫ్ ఆఫ్ ఎక్టర్` వంటి సినిమాలతో త నకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకునే ప్రయత్నం చేశారు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వెండి తెరపై చిన్నదైనా? ప్రభావవంతమైన నటనను ప్రదర్శించడం అమ్మడి ప్రత్యేకత. ముఖ్యంగా చాహత్ ఎంపిక చేసుకునే పాత్రలు .. స్క్రీన్ ప్రెజెన్స్ అమ్మడిని విలక్షణమైన నటిగా నిలబెడుతున్నాయి.
తాజాగా చాహత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ముంబైలో జన్మించినా? తన ఆత్మ మాత్రం గోవాలోనే ఉంటుందన్నారు. జీవితంలో ఎప్పుడైనా ఒత్తిడి ఎదురైతే లేదా రీసెట్ కావాల్సి వస్తే తనకు గోవానే ఏకైక శరణ్యమని తెలిపారు. గోవాతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ అది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదని తనకోసం ప్రత్యేకంగా సృష్టించబడిన ప్రదేశమని చాహత్ వెల్లడించారు. జీవితం సరైన మార్గంలో వెళ్లకుండా గందరగోళంగా మారిన ప్రతిసారీ తాను వాగాటర్ బీచ్‌లో ధ్యానం చేస్తానని అప్పుడు అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. అక్కడి వాతావరణం తనకు అంతులేని ప్రశాంతతను ఇస్తుందని వివరించారు.
సాధారణ టూరిస్టులా కాకుండా గోవాలో స్థానికురాలిగా జీవించడానికే తాను ఎక్కువగా ఇష్టపడతానని చాహత్ చెప్పారు. అక్కడి బ్యాక్ వాటర్స్‌లో కయాకింగ్ చేయడం, విల్లా చుట్టూ సైకిల్ తొడగడం లాంటివి చేస్తానని తెలిపారు. అంతే కాదు స్థానికంగా ఉండే ఒక ఆంటీ ద్వారా పొయ్ చేయడం నేర్చుకోవడంతో పాటు కలమారి కర్రీ వండటం కూడా నేర్చుకున్నట్లు ఎంతో ముచ్చటగా పంచుకున్నారు. నటనతో పాటు వ్యక్తిగత జీవితంలో మాతృత్వాన్ని బాధ్యతగా నిర్వహిస్తూనే మరోవైపు రచనలు చేయడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.
నటన కంటే తనకు రైటింగ్ అంటేనే ఎక్కువగా ఇష్టమని ప్రస్తుతం తాను మొదటి ఓటీటీ సిరీస్ `హస్రతీన్లో` నటిస్తున్నట్లు వెల్లడించారు. కెరీర్‌ను .. వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన పెళ్లి గురించి వస్తోన్న ఆలోచనలపై స్పందించారు. తనకు ఇప్పుడే వివాహం కాదని ..అందుకు ఇంకా సమయం ఉందన్నారు. అలాగని తానేమి వివాహానికి వ్యతిరేకం కాదంటోంది. పెళ్లి అనే భావనతో పెద్దగా ఇమడ లేకపోతున్నానని తెలిపారు. జీవితంలో పెళ్లి అనే ఒక బంధం కంటే మించిన పెద్ద లక్ష్యాలు చాలా ఉన్నాయని చాహత్ ఖన్నా స్పష్టం చేశారు.
మొత్తంగా చూస్తే గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతతను వెతుక్కునే చాహత్ ఖన్నా మనస్తత్వం ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముంబై హడావుడి జీవితం నుంచి బ్రేక్ తీసుకుంటూ గోవా మట్టితో ముడిపడిన ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి అందరితో పంచుకోవడం పట్ల అభిమానులు హర్షిస్తున్నారు.
