మేడమ్ అని గౌరవంగా పిలుస్తాడు.. చాహల్ సోదరి
అంతులేని ప్రేమ, నవ్వు కాంతితో మీరు ఇతరులకు ఇచ్చే ప్రతి మంచితనాన్ని దేవుడు మీకు తిరిగి ఇస్తాడు`` అంటూ భావోద్వేగపు పోస్ట్ చేసారు క్రికెటర్ చాహల్ సోదరి కెనా ద్వివేది.
By: Sivaji Kontham | 24 Oct 2025 9:43 PM IST``నా సోదరుడు, హృదయంతో రక్షకుడు.. ఆత్మతో మార్గదర్శకుడు. అంతులేని ప్రేమ, నవ్వు కాంతితో మీరు ఇతరులకు ఇచ్చే ప్రతి మంచితనాన్ని దేవుడు మీకు తిరిగి ఇస్తాడు`` అంటూ భావోద్వేగపు పోస్ట్ చేసారు క్రికెటర్ చాహల్ సోదరి కెనా ద్వివేది. తన సోదరుడి మంచితనం, ఆడవారిని గౌరవించే ప్రేమించే గొప్ప లక్షణం గురించి కెనా ద్వివేది సోషల్ మీడియాల్లో ఒక నోట్ రాసారు.
ఎదుటివారిని ఎంతో గౌరవంగా సంబోధించే తన సోదరుడు, స్త్రీలను సురక్షితంగా ఎలాంటి సమస్యా లేకుండా చూసుకుంటారని అన్నారు కెనా ద్వివేది. కెనా తన సోదరుడు చాహల్ వ్యక్తిత్వం, విలువలను ప్రశంసించారు. అయితే కెనా ద్వివేది పోస్ట్ ని చదివిన తర్వాత తన సోదరుడిని పొగడటంతో పాటు అతడి మాజీ భార్య ధనశ్రీ వర్మపై కెనా సెటైరికల్ స్పందన ఇది అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
మహిళల విషయంలో ఎంతో వినయం, గౌరవాన్ని కలిగి ఉంటాడని చాహల్ ని కెనా ప్రశంసించారు. ప్రపంచం క్రూరంగా మారినప్పుడు కూడా మౌనాన్ని ఎంచుకునే వ్యక్తిగా అతడిని అభివర్ణించింది. కొన్నిసార్లు ఒక బంధం రక్తంతో రాయబడదు.. కానీ ఒక వాగ్దానంతో ముడిపడి ఉంటుంది. జీవితంలోని ప్రతి అధ్యాయంలో నన్ను రక్షించడానికి, మార్గనిర్దేశం చేయడానికి, నాకు తోడుగా ఉండటానికి ఒక వాగ్దానం మీరు. ప్రతిరోజూ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు అని చాహల్ పై కెనా ప్రశంసలు కురిపించారు.
నువ్వు సొంత మనిషిగా భావిస్తావు.. స్త్రీలను నిజంగా గౌరవించే వ్యక్తివి.. ప్రతి స్త్రీని `మేడమ్` అని సంబోధించే వ్యక్తివి.. తన చుట్టూ ఉన్న ప్రతి ఆత్మ గౌరవాన్ని కాపాడేవాడు.. ప్రపంచం క్రూరంగా మారినప్పుడు నిశ్శబ్దాన్ని ఎంచుకునే వ్యక్తివి నువ్వు.. అని రాసారు. నేను ఏడ్చిన ప్రతిసారీ, నా సోదరుడు నన్ను ఉత్సాహపరిచేందుకు ఫన్నీగా నృత్యం చేస్తాడు అని కూడా కెనా రాసారు.
మరో పోస్ట్ లో చాహల్ ధనశ్రీని ఆటపట్టిస్తూ ఒక వ్యాఖ్యను రాసారు. విడాకుల ప్రక్రియలో ధనశ్రీకి 4.5 కోట్ల భరణం చెల్లించాలని కోర్టు సూచించింది. అయితే ఇండిపెండెంట్ అమ్మాయిలు భర్త నుంచి భరణం ఆశించకూడదని దిల్లీ కోర్టు సూచించినదానిని అనుసరించాల్సిందిగా తన మాజీ భార్య ధనశ్రీకి సోషల్ మీడియా ద్వారా సూచించాడు చాహల్. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గనని అమ్మపై ఓటేసి చెప్పు! అని కూడా పంచ్ వేసాడు.
2020లో కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో యుజ్వేంద్ర చాహల్ - కొరియోగ్రాఫర్ కం ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మ కలుసుకున్నారు. ఆ సమయంలో ధనశ్రీ చాహల్‌కు ఆన్‌లైన్ లో డ్యాన్స్ పాఠాలు చెప్పారు. ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారింది. డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే సంసారంలో సమస్యల కారణంగా ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. కోర్టు విడాకులు మంజూరు చేసింది.
