చాహల్ నుంచి ధనశ్రీ వజ్రాలు డిమాండ్ చేసారా?
భార్య ధనశ్రీ వర్మ నుండి టీమిండియా క్రికెటర్ చాహల్ బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. మనస్ఫర్థల కారణంగా కాపురంలో చిక్కులు వచ్చి పడ్డాయి.
By: Sivaji Kontham | 5 Aug 2025 11:02 PM ISTభార్య ధనశ్రీ వర్మ నుండి టీమిండియా క్రికెటర్ చాహల్ బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. మనస్ఫర్థల కారణంగా కాపురంలో చిక్కులు వచ్చి పడ్డాయి. అయితే ఈ బ్రేకప్ వివాదానికి మునుపు ఆ ఇద్దరూ ఆదర్శ జంట. తన భార్యకు మద్ధతుగా నిలుస్తూ అతడు ఝలక్ దిఖలాజా 11 ఎపిసోడ్ లో పాల్గొన్నాడు. అప్పటి పాత క్లిప్ ఒకటి ఇప్పుడు చర్చగా మారింది.
రియాలిటీ షోలో ఒకానొక ప్లెజెంట్ మూవ్ మెంట్ లో ధనశ్రీ `డైమండ్` అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుంది. అయితే ఆ సమయంలో చాహల్ చాలా సరదాగా ఆటపట్టిస్తూ... ధనశ్రీకి డైమండ్స్ పిచ్చి ఉందని అన్నాడు. ధనశ్రీ ఎదురు ప్రశ్నించగా... చాహల్ తన వజ్రాల చెవిపోగులను ఎత్తి చూపుతూ ధనశ్రీ ఎప్పుడూ వజ్రాలను డిమాండ్ చేయదని సరదాగా మాట మార్చాడు. ఆ తర్వాత ఆమె నిజంగా కోరుకునేది ఆభరణాలు కాదని, తనను క్షమించాలని చాహల్ కోరాడు.
డబ్బు కోసం రిలేషన్ లో ఉన్నారనే వాదనలపైనా చాహల్ స్పందించాడు. బ్రేకప్ సమయంలో ధనశ్రీ వైపు నుంచి వచ్చే ఆరోపణల కారణంగా తాను స్పందించాల్సి వస్తోందని అతడు చెప్పాడు. ప్రస్తుతం చాహల్ తో బ్రేకప్ అయినా కానీ, సామరస్యంగా ఆ ఇద్దరూ స్నేహితులుగా కొనసాగడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం. తాను ప్రశాంత జీవనాన్ని కోరుకుంటోందని తెలుస్తోంది.
ధనశ్రీ ఇటీవలి దుబాయ్ ట్రిప్ నుండి తీసిన ప్రశాంతమైన ఫోటో డంప్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
క్యాప్షన్ లో తన అలసట గురించి పోరాటాల గురించి ఒకే ఒక్క వాక్యంలో ప్రస్థావించింది. ``ఒక లైఫ్ టైమ్ అనిపించిన తర్వాత దుబాయ్‌కి తిరిగి వచ్చాను… ఇక్కడ నేను పెరిగాను..ఈ నగరం నాకు చాలా ముఖ్యమైన జ్ఞాపకాలను ఇచ్చింది . సిటీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూడటం అద్భుతంగా ఉంది. నగరంలో ఒక అందమైన హిందూ ఆలయాన్ని సందర్శించి శాంతియుతంగా, శక్తివంతంగా, సంస్కృతి ని సమాజాన్ని స్వీకరించడంలో ఈ నగరం ఎంత దూరం ప్రయాణించిందో గుర్తు చేస్తోంది.. అని వ్యాఖ్యను జోడించింది.
