మృత్యువు ముందు వింతగా ప్రవర్తించిన టాప్-10 స్టార్లు
అతడు తనకు తానే ఆర్.ఐ.పి (రెస్ట్ ఇన్ పీస్) అని సామాజిక మాధ్యమాల్లో హింట్ ఇచ్చాడు. అక్షరాలు తిరగేసి (పిఐఆర్) రాస్తే అసలు రహస్యం బయటపడింది.
By: Sivaji Kontham | 13 Feb 2026 10:34 AM ISTకొరియన్ డ్రామా (కే- డ్రామా) నటుడు జంగ్ ఉన్-వూ తన చావుకు ముందు వింతగా ప్రవర్తించడం ఇప్పుడు సోషల్ మీడియాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. అతడు తనకు తానే ఆర్.ఐ.పి (రెస్ట్ ఇన్ పీస్) అని సామాజిక మాధ్యమాల్లో హింట్ ఇచ్చాడు. అక్షరాలు తిరగేసి (పిఐఆర్) రాస్తే అసలు రహస్యం బయటపడింది. అతడు తాను మరణిస్తూ, అప్పటికే మరణించిన ప్రముఖ సెలబ్రిటీల ఫోటోలను కూడా షేర్ చేసాడు. వారి బాటలోనే తాను కూడా మరణిస్తున్నానని చెప్పకనే చెప్పాడు. అతడికి అంత కష్టం ఏం వచ్చిందో తెలీదు కానీ, ఆత్మహత్యకు కారణమేమిటో తెలీదు కానీ తన మరణం గురించి అతడు తనకు తానే తెలుసుకున్నాడు. ఇదే ఎలిమెంట్ ని కొంచెం తెలివిగా ఉపయోగించుకుని ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీ సినిమాలను అత్యంత విజయవంతంగా హాలీవుడ్ లో నిర్మిస్తున్నారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇంతకుముందు ఫైనల్ డెస్టినేషన్ 6 (ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్) విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించడమే గాక, భారతదేశంలోను గొప్ప విజయాన్ని అందుకుంది.
అయితే ఆ సినిమాలో ఉదంతంలాగే, సినిమా ఇండస్ట్రీలో తమ మరణానికి ముందు ఏదో ఒక రూపంలో సంకేతాలు ఇచ్చిన నటీనటులు ప్రపంచవ్యాప్తంగా మరికొందరు ఉన్నారు. తమ అంతిమ క్షణాలు దగ్గర పడ్డాయని వారు గ్రహించారో లేక అది యాథృచ్ఛికమో కానీ, ఆ ఘటనలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. కొందరు చావుకు ముందు సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా లేదా మాటలు - ప్రవర్తన ద్వారా తమ కథ ముగుస్తోందని హింట్ ఇచ్చారు. ప్రతి చావు వెనక ఆధారం పోలీసులకు లభించాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో అటువంటి కొన్ని కీలక ఉదాహరణలున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ అర్థాంతరంగా మరణించడానికి ముందు అతడు తన మృత్యువు గురించి సన్నిహితులకు హింట్ ఇచ్చాడు. ఆత్మహత్యకు ముందు తన సన్నిహితులకు కొన్ని సంకేతాలు ఇచ్చారని చెబుతుంటారు. మరణించడానికి కొన్ని గంటల ముందు తన భార్యకు ఫోన్ చేసి `ఐ లవ్ యూ` అని చెప్పడం, అలాగే తన స్నేహితులకు ఫోన్ చేయడానికి ప్రయత్నించడం ఒక ముందస్తు వీడ్కోలుగా అభిమానులు భావించారు.
కథానాయిక ఆర్తీ అగర్వాల్ మరణం ఆత్మహత్య కాకపోయినా ..లైపోసక్షన్ సర్జరీ వైఫల్యంతో మరణించారని చెప్పినా కానీ, తన చివరి రోజుల్లో ఆర్తీ చాలా డిప్రెషన్‌లో ఉండేవారు. తన కెరీర్ ముగిసిపోతుందనే భయం.. చివరి దశకు చేరుకున్నాననే భావన ఈ వర్థమాన నటి మాటల్లో వ్యక్తమయ్యేదని సన్నిహితులు అప్పట్లో పేర్కొన్నారు.
బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మిస్టీరియస్ మరణానికి ముందు చాలా హింట్ ఇచ్చాడు. అతడి మరణానికి కొన్ని రోజుల ముందు ఇన్‌స్టా పోస్ట్‌లు చాలా ఫిలాసఫికల్‌గా ఉండేవి. ముఖ్యంగా తన తల్లిని స్మరిస్తూ పెట్టిన చివరి పోస్ట్ ఆశ్చర్యపరిచింది. ``మసకబారిన గతం కన్నీటి చుక్కల నుంచి ఆవిరైపోతోంది.. కలలు చిరునవ్వును మోస్తున్నాయి..`` అంటూ సుశాంత్ రాసిన మాటలు అతడి మానసిక స్థితిని, ఏదో ఒక ముగింపును కోరుకుంటున్నట్లు సూచించాయి.
తన ఆత్మహత్యకు ముందు జియా ఖాన్ ఒక సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాశారు. అందులో తన బాధను, తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభను వివరిస్తూ.. త్వరలోనే ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. జియా ఖాన్ తన ఫ్లాట్లో ఉరి వేసుకుని కనిపించారని పోలీసులు కేసు నమోదు చేసినా దీని వెనక మిస్టరీపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ఈకేసులో నిందితుడు బయటపడినా అభిమానులు నమ్మరు. కానీ జియా తన చావు గురించి (ఫైనల్ డెస్టినేషన్ గురించి) ముందే తెలుసుకుంది.
దుబాయ్‌లో పెళ్లికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మరణించిన లెజెండరీ కథానాయిక శ్రీదేవి కథ గురించి పరిచయం అవసరం లేదు. తన భర్త బోనీ కపూర్ చెప్పిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఆమె మరణానికి కొన్ని గంటల ముందు వింతగా ప్రవర్తించారని, చాలా సేపు అద్దంలో తనను తాను చూసుకుంటూ గడిపారని టాక్. అయితే ఇది కేవలం చర్చలకే పరిమితమైంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆకస్మిక మరణం చాలా కలచివేసింది. విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య చేసుకునే ముందు తన స్కూల్ నోట్‌బుక్స్‌లో ``నేను అందరినీ మిస్ అవుతున్నాను`` అని, ``జీవితం చాలా భారంగా ఉంది`` అని అర్థం వచ్చేలా కొన్ని వాక్యాలు రాశారు. ఇది మీరా మనసులో మరణం గురించి ఆలోచనలు ముందే ఉన్నాయని సూచించింది. స్కూలుకు వెళ్లే అమ్మాయి ఫైనల్ డెస్టినేషన్ చాలా అయోమయానికి గురి చేసింది.
ఐటమ్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత మరణానికి ముందు రోజు రాత్రి తన స్నేహితురాలైన నటి అనురాధ కు ఫోన్ చేసి వెంటనే రమ్మని కోరారు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని పదే పదే అడిగారు. తీరా అనురాధ వెళ్లేసరికి స్మిత విగతజీవిగా పడి ఉన్నారు. తన మరణం గురించి ఆమెకు ముందే ఏదో స్పష్టత ఉందని ఈ ఘటన నిరూపించింది.
అంతర్జాతీయ స్థాయి నటుల వివరాలను పరిశీలిస్తే..
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేం పాల్ వాకర్ తన మరణానికి కొద్ది రోజుల ముందు స్నేహితులతో మాట్లాడుతూ ``నేను ఒకవేళ వేగంగా కారు నడుపుతూ చనిపోతే.. నేను నవ్వుతూనే ఉన్నానని అనుకోండి`` అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. యాదృచ్ఛికంగా ఆయన కారు ప్రమాదంలోనే చనిపోయారు. ప్రపంచాన్ని నవ్వించిన దిగ్గజ నటుడు రాబిన్ విలియమ్స్ మరణానికి కొన్ని రోజుల ముందు తన కుటుంబ సభ్యులతో చాలా ఎమోషనల్‌గా మాట్లాడటం, తన ఆస్తుల విషయంలో కొన్ని మార్పులు చేయడం వంటివి గమనిస్తే ఆయన తన ముగింపును ముందే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది.
`ఫైనల్ డెస్టినేషన్` థీమ్‌తో ఇలాంటి రియల్ లైఫ్ మిస్టరీల మీద పరిశోధించేవారికి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయనడంలో సందేహం లేదు.
(డిస్‌క్లైమర్: పైన పేర్కొన్న కథనాలు అన్నీ సోషల్ మీడియాల్లో పెద్ద డిబేట్లుగా మారిన వాటిని సేకరించినవి.. ఇవి సృష్టించే కథలు కావు)
