గ్లామర్ కు గుడ్‌బై.. సింప్లిసిటీతో సెలబ్రిటీ కపుల్స్ కొత్త ట్రెండ్
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ పై ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అయితే ఆ ఆసక్తిని తీర్చే విధానం మాత్రం గతంతో పోలిస్తే మారిపోయింది.
By: Sravani Lakshmi Srungarapu | 4 Aug 2026 11:27 AM ISTగ్లామర్, డెస్టినేషన్ ఫోటోషూట్లు, డిజైనర్ కాస్ట్యూమ్స్… ఒకప్పుడు సెలబ్రిటీ కపుల్స్ ఫోటోలంటే ఇవే మెయిన్ ఎట్రాక్షన్స్. కానీ రీసెంట్ గా సోషల్ మీడియాలో కనిపిస్తున్న మరో ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే, ఆడంబరానికి బదులు సహజత్వానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఆడియన్స్ ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసిన ఫ్రేమ్‌ల కంటే, నిజమైన అనుబంధాన్ని ప్రతిబింబించే క్షణాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ మార్పుకు కోలీవుడ్ లోని కొన్ని ప్రముఖ జంటలు కూడా ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాయి.
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ పై ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అయితే ఆ ఆసక్తిని తీర్చే విధానం మాత్రం గతంతో పోలిస్తే మారిపోయింది. భారీ సెట్లలో తీసిన ఫోటోల కంటే, రెగ్యులర్ అవుట్‌ఫిట్స్ లో, ప్రకృతి మధ్య లేదా డైలీ లైఫ్ కు దగ్గరగా ఉండే దృశ్యాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. అలాంటి ఫోటోలు ఆడియన్స్ లో రిలేటబిలిటీని పెంచడమే కాకుండా, సెలబ్రిటీలను కూడా సాధారణ మనుషుల్లా చూడాలనే భావనను బలపరుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శివకార్తికేయన్, ఆయన భార్య ఆర్తితో కలిసి కనిపించిన రీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో డిస్కషన్‌కు దారితీశాయి. ఈ ఫోటోల్లో స్పెషల్ గా కనిపించింది గ్లామర్ కాదు, వారిద్దరి మధ్య కనిపించిన నేచురల్ బాండింగ్, కెమెరా కోసం అతిగా పోజులివ్వడం, ఖరీదైన లొకేషన్లను హైలైట్ చేయడం వంటి ప్రయత్నాలు కనిపించకపోవడం ఈ ఫోటోలను మరింత స్పెషల్ గా నిలబెట్టాయి. దీర్ఘకాల దాంపత్య జీవితంలో ఏర్పడే సౌకర్యం, పరస్పర నమ్మకం, స్నేహం వంటి భావాలు వారి ఫోటోల్లో ఎంతో సహజంగా కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ ఆ ఫోటోలను చూసి కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల ఇమేజ్ బిల్డింగ్ కూడా కొత్త దిశగా మారుతోంది. ఒకప్పుడు లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ప్రదర్శించడం ప్రధాన వ్యూహంగా ఉండగా, ఇప్పుడు ఫ్యామిలీ వాల్యూస్, మంచి లైఫ్ స్టైల్, వ్యక్తిగత అనుబంధాలను చూపించడం కూడా ఒక స్ట్రాంగ్ బ్రాండింగ్‌గా మారింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో కనెక్ట్ కావాలనుకునే యాక్టర్లకు ఇది మరింత ఉపయోగపడుతోంది. సెలబ్రిటీ కల్చర్‌లో ఆడంబరం ఎప్పుడూ ఎట్రాక్షనే అయినప్పటికీ చివరికి ఆడియన్స్ ను ఎక్కువగా టచ్ చేసేది నిజాయితీగా కనిపించే సంబంధాలే అని ఈ ట్రెండ్ మరోసారి గుర్తు చేస్తోంది. గ్లామర్‌తో కాకుండా సహజత్వంతో కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవచ్చని ఈ మారుతున్న సెలబ్రిటీ ఫోటో కల్చర్ స్పష్టంగా తెలియచేస్తోంది.
