నటీమణులకు బ్రేక్‌లు కామాలు చాలా అవసరం.
తారలు ఇటీవలి కాలంలో వ్యక్తిగత జీవితానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఓవైపు కుటుంబ జీవితాన్ని చక్కదిద్దుకుంటూనే, స్టార్లుగా కొనసాగడం ఎలాగో నేర్చుకుంటున్నారు.
By: Sivaji Kontham | 8 Jan 2026 1:00 AM ISTతారలు ఇటీవలి కాలంలో వ్యక్తిగత జీవితానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఓవైపు కుటుంబ జీవితాన్ని చక్కదిద్దుకుంటూనే, స్టార్లుగా కొనసాగడం ఎలాగో నేర్చుకుంటున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కరీనా కపూర్, నయనతార. నిజానికి గ్లామర్ రంగంలో పెళ్లి తర్వాత కూడా స్టార్ డమ్ ని కొనసాగిస్తూ లైమ్ లైట్ లో ఉండటం ఆషామాషీ వ్యవహారం కాదు. వీళ్లంతా తమను తాము నిరంతరం అప్ డేట్ చేసుకుంటూ, నేటి జెన్ జెడ్ కి అవసరమైన ట్రీట్ ఇవ్వడానికి వెనకాడరు. కత్రిన, కియరా అద్వాణీ, యామి గౌతమ్ లాంటి కథానాయికలు మునుముందు కరీనా, నయన్ లాంటి సీనియర్లను అనుసరించనున్నారు.
పెళ్లి తర్వాత కూడా కెరీర్ ని విజయవంతంగా నడిపించడం చాలా అరుదు. కానీ శ్రీదేవి, మాధురి ధీక్షిత్, రాణీ ముఖర్జీ, జ్యోతిక లాంటి సీనియర్ నటీమణులు తిరిగి రీలాంచ్ అవ్వడమే కాదు, వరస అవకాశాల్ని అందుకున్నారు. నిజానికి ఈ ఫార్ములాను అనుసరించే ఆలోచన హాలీవుడ్ నుంచి దిగుమతి అయింది. ఏంజెలినా జోలీ, పెనెలోప్ క్రజ్, పమేలా, ఎలిజబెత్ టేలర్ .. ఇలా చాలామంది పెళ్లి తర్వాత కూడా పెద్ద స్టార్లుగా ఏలారు.
ఇప్పుడు స్ట్రేంజర్ థింగ్స్‌లో ఎలెవెన్ పాత్ర ముగింపు వేళ, మిల్లీ బాబీ బ్రౌన్ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. మిలీ తన కుటుంబాన్ని ఈదుతూనే హాలీవుడ్ లో పెద్ద స్టార్ గా ఎదిగారు. తాజా సమాచారం మేరకు తన చివరి షోను పూర్తి చేసిన ఈ నటి ఇకపై నటనకు స్వస్థి చెప్పాలని నిర్ణయించుకున్నారు. తన భర్త పిల్లలకు స్పేస్ ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. భర్త జేక్ బొంగియోవి .. కొత్తగా దత్తత తీసుకున్న కుమార్తెపై దృష్టి పెట్టాలనే కోరికతోనే ఆమె ఇలా చేస్తున్నారు.
మిల్లీ 2024లో జేక్ బొంగియోవిని పెళ్లాడాక ఇప్పుడు గ్రామీణ జార్జియాలోని ఒక పొలంలో నివసిస్తున్నారు. ఆమె తన బ్యూటీ బ్రాండ్ ఫ్లోరెన్స్ బై మిల్స్‌ను కూడా రన్ చేస్తున్నారు. నటన నుంచి విరమించాక ఒక కొత్త వృత్తిని అనుసరించడం సవాళ్లతో కూడుకున్నదే అయినా విధి అలా నిర్ణయించిందని భావించాలి.
పైన ఉదహరించిన తారలంతా నేటి జెన్ జెడ్ నటీనటులకు ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించి ఓ స్పష్ఠమైన సందేశాన్ని ఇస్తున్నారు. స్టార్ గా ఎదిగిన తర్వాత వ్యక్తిగత, కుటుంబ జీవితానికి కూడా ప్రాధాన్యతనివ్వాలనే సందేశాన్నిస్తున్నారు. పెళ్లి పిల్లలు కుటుంబంతో పాటు స్టార్ గా కొనసాగాలి. పిల్లల కోసం అవసరం మేర వృత్తిగత జీవితానికి బ్రేక్ నివ్వాలి. ఈ ట్రెండ్ ని నేటితరం కూడా అనుసరించగలిగితే అది జీవితంలో సంపూర్ణ విజయం.
