కవల పిల్లలకు జన్మనిచ్చిన సెలబ్రిటీ తల్లిదండ్రులు వీళ్లే!
కవల పిల్లలు జన్మించడం అన్నది చాలా అరుదు. ఎవరికో తప్ప అందరికీ సాధ్యంకాని వరమది.
By: Srikanth Kontham | 24 Oct 2025 2:00 PM ISTకవల పిల్లలు జన్మించడం అన్నది చాలా అరుదు. ఎవరికో తప్ప అందరికీ సాధ్యంకాని వరమది. తాజాగా మెగా పవర్ స్టార్ చరణ్ సతీమణి ఉపాసన కూడా కవలలకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. తొలుత ఉపాసన గర్బం దాల్చిందన్న విషయమే ఓ సర్ ప్రైజింగ్ అనిపిస్తే? కవల పిల్లలు పుడతారంటూ అసలు విషయం బయటకు రావ డంతో? అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. దీంతో మెగా కుటుంబం కూడా ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. సెలబ్రిటీల్లో కూడా కవలలు పిల్లలు జన్మించడం అన్నది పెద్దగా కనిపించలేదు.
ఓసారి కవలలకు జన్మనిచ్చిన సెలబ్రిటీ జంటల్లోకి వెళ్తే..బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ -నటి మాన్యత 2008 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2010లో ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. అబ్బాయికి షహరా అమ్మాయికి ఇక్రాన్ అని పేర్లు పెట్టారు. అలాగే మంచు విష్ణు-వెరోనికా రెడ్డి దంతపులకు కవలలు జన్మించారు. మొత్తం నలుగురు సంతానం కాగా తొలి సంతానంగా ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. వారే అరియానా-వివియానా. అలాగే యాంకర్ ఉదయభాను- విజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ దంపతులకు కవల ఆడపిల్లలు జన్మించారు. కుమార్తెలకు దివి నక్షత్ర, భూమి ఆరాధ్య గా పేర్లు పెట్టారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దంపతులకు 2017 లో కవలలు జన్మించారు. ఒకరు అమ్మాయి కాగా-మరొకకు అబ్బాయి. అలాగే నటు భరత్ చిన్న నాటి గర్ల్ ప్రెండ్ ని వివాహం చేసుకున్నాడు. వారికి కూడా 2018 లో కవలలు జన్మించారు. వారి పేర్లు ఆద్యన్, జెన్. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సరోగసీ గర్భం ద్వారా కవల ఆడ పిల్లలకు జన్మ నిచ్చిన సంగతి తెలిసిందే.
సన్నిలియోన్ కూడా అద్దె గర్బం ద్వారా పిల్లల్ని కన్న సంగతి తెలిసిందే. వీరికి అషర్, నోహా అనే పేర్లు పెట్టారు.బాలీవుడ్ లేడీ డైరెక్టర్ ఫరాఖాన్ -శిరీష్ కుందర్ దంపతులకు దివా- అన్య అనే ఇద్దరు కవలలు జన్మిం చారు.`సూర్యం` హీరోయిన్ సెలీనా జెట్లీ 2012లో ఆస్టేలియన్ ఎంట్రప్రెన్యూర్ పీటర్ హాగ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు మగ కవలలు పుట్టారు. ఆర్థర్ హాగ్, షంషేర్ హాగ్ అనే పేర్లు పెట్టారు. అలాగే నమిత-వీరేంద్ర చౌదరి దంపతులకు కవలలు పిల్లలు జన్మించారు.
