విక్టరీకి కేరాఫ్ అడ్రస్ వెంకటేష్..!
వెంకటేష్ అభిమానుల హీరో మాత్రమే కాదు అందరు హీరోలు కూడా అభిమానించే హీరో. ఆయన గురించి మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ తనకు 40 ఏళ్లుగా తెలుసు.. ఆయన ఎలాంటి సినిమా అయినా చేయగలడు.
By: Ramesh Boddu | 13 Dec 2025 11:03 AM ISTదగ్గుబాటి వారసుడు మూవీ మొఘల్ రామానాయుడు కొడుకుగా హీరోగా ఎంట్రీ దొరకడం ఈజీనే కానీ తనకంటూ ఒక సెపరేట్ స్టైల్, క్రేజ్ ఏర్పరచుకుని దాదాపు 30 ఏళ్లకు పైగా తన ఫాం కొనసాగిస్తూ తన నటనతో ఆబాలగోపాలాన్ని అలరిస్తూ వస్తున్నారు విక్టరీ వెంకటేష్. విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో ఆయన. వెంకటేష్ ఎలాంటి సినిమా చేస్తాడు అంటే ఎలాంటి సినిమా అయినా చేస్తాడు.. చేయగలడు అని కెరీర్ మొదటి నుంచి ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు ఆయన.
కలియుగ పాండవులు నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు 76 సినిమాల్లో వెంకటేష్ చేసిన కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ ఇలా ఆడియన్స్ ని మెప్పిస్తూ తన విక్టరీ మేనియా కొనసాగించారు వెంకటేష్. తన ఫ్యాస్ తో పాటు కామన్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే హీరో వెంకటేష్. వేరే స్టార్ ఫ్యాన్స్ కూడా వెంకటేష్ ఫ్యాన్సే అనేలా ఆయన సినిమాలు ఉంటాయి.
ముఖ్యంగా ఆయన సినిమాలు ఆడియన్స్ ని సూపర్ ఎంటర్టైన్ చేస్తాయి. వెంకటేష్ ఫ్యాన్స్ కి ఇచ్చే మెసేజ్ లు కూడా ఆకట్టుకుంటాయి. లైఫ్ ఫిలాసఫీని తన మాటల్లో చాలా అందంగా చెబుతుంటారు ఆయన. ఎక్కువగా డివోషనల్ కనెక్టివిటీ ఉంటూ వెంకటేష్ తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ని ఏర్పరచుకున్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తే అది వెంకటేష్ మాత్రమే చేయాలి అనేలా ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్నారు ఆయన. ఇప్పటికీ వెంకటేష్ నుంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుంది అంటే కమర్షియల్ సినిమాలకు ధీటుగా వసూళ్లు వస్తాయి. డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ అటెంప్ట్స్ తో వెంకటేష్ ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తారు.
వెంకటేష్ అభిమానుల హీరో మాత్రమే కాదు అందరు హీరోలు కూడా అభిమానించే హీరో. ఆయన గురించి మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ తనకు 40 ఏళ్లుగా తెలుసు.. ఆయన ఎలాంటి సినిమా అయినా చేయగలడు. చంటి లా అమాయకంగా చేస్తాడు. గణేష్ లా అన్యాయాన్ని ఎదురించే మాస్ రోల్ చేస్తారని అన్నారు. మహేష్ అయితే వెంకటేష్ లోని కమిట్మెంట్ ఇప్పటికీ ఆయన పాటించే రూల్స్ గురించి గొప్పగా చెప్పారు.
నాని అయితే వెంకటేష్ ఆవకాయ్ పచ్చడి లాంటి వారు ఆయన్ను ఇష్టపడని వారు ఉండరని అన్నారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు వి ఫర్ విక్టరీ అని అన్నారు. వెంకటేష్ గురించి పరిచూరి గోపాలకృష్ణ మేము చెప్పడం వల్ల వెంకటేష్ ని హీరోగా చేశారు కాబట్టి మా కలం హీరో అంటూ ఆయన్ను ప్రస్తావిస్తామని అన్నారు.
నేడు విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీస్ వెంకటేష్ గురించి మాట్లాడిన కొన్ని విషయాలు అన్నీ సమకూర్చి సురేష్ ప్రొడక్షన్స్ ఒక స్పెషల్ వీడియో చేసింది. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా ఒక స్పెషల్ క్యామియో రోల్ చేస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విక్టరీ వెంకటేష్ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తుంది టీమ్ తుపాకి.కామ్.
