Begin typing your search above and press return to search.

A- సర్టిఫికేట్ ఇచ్చాక‌ ఈ రూల్స్‌ ఏంటి గురూ?

ఏది క్రియేటివిటీ? ఏది అస‌భ్య‌త‌? దీనికి సీబీఎఫ్‌సీకి సంపూర్ణ‌మైన అవ‌గాహ‌న ఉందా లేదా? అనే చ‌ర్చ సాగుతోంది.

By:  Sivaji Kontham   |   31 May 2026 6:06 PM IST
A- సర్టిఫికేట్ ఇచ్చాక‌ ఈ రూల్స్‌ ఏంటి గురూ?
X

ఏది క్రియేటివిటీ? ఏది అస‌భ్య‌త‌? దీనికి సీబీఎఫ్‌సీకి సంపూర్ణ‌మైన అవ‌గాహ‌న ఉందా లేదా? అనే చ‌ర్చ సాగుతోంది. ఒక‌ప్పుడు వివాదాస్ప‌ద‌ ఆర్జీవీ, మంచు మోహ‌న్ బాబు వంటి ప్ర‌ముఖులు త‌మ సినిమాల విష‌యంలో సీబీఎఫ్‌సి అభ్యంత‌రాలకు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తారు. సృజనాత్మ‌క‌త‌ను ఇష్టానుసారం ఖూనీ చేస్తున్నార‌ని సెన్సార్ ప్ర‌తినిధ‌ల‌పై ఆరోపించారు. సినిమాల్లో హ‌ద్దుమీరిన శృంగార‌ స‌న్నివేశాల‌ను కోసేస్తున్నామ‌ని సెన్సార్ చెబుతుంటే.. దానిని సృజ‌నాత్మ‌క‌త‌ను హ‌రించ‌డ‌మేన‌ని విమ‌ర్శించారు.

ఇప్పుడు ఒక హాలీవుడ్ హార‌ర్ సినిమా విష‌యంలోను ఇలాంటి చ‌ర్చ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమాకి వాస్త‌వంగా యుఏ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేదు. `ఎ` స‌ర్టిఫికెట్ ఇచ్చారు. దీని ఉద్ధేశం పిల్ల‌లు స‌హా ఒక సెక్షన్ ఆడియెన్ ఈ సినిమా చూడ‌కూడ‌ద‌ని నిర్ధేశించారు. కానీ వ‌యోజ‌నులైన యువ‌త‌రం, అడ‌ల్ట్ చూడ‌టానికి ఉద్ధేశించిన రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని సెన్సార్ కోత‌కు గురి చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇది ఏ సినిమా గురించి అంటే..? హాలీవుడ్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించి, ప్ర‌స్తుతం భార‌త‌దేశంలోను విడుద‌లైన అబ్సెష‌న్ అనే హార‌ర్ చిత్రం గురించి. నిజానికి ఈ సినిమా నుంచి కొన్ని సెక‌న్ల పాటు ఘాటైన స‌న్నివేశాల‌ను సెన్సార్ కోసేసింది. ఇప్పుడు అదే వెర్ష‌న్ ని ఓటీటీలోను రిలీజ్ కి అనుమ‌తిస్తున్న‌ట్టు తెలిసింది. నిజానికి ఈ సినిమాని నిర్మించిన యూనివ‌ర్శ‌ల్ పిక్చ‌ర్స్ సంస్థ ఒరిజినల్ వెర్ష‌న్ ని భార‌త‌దేశం స‌హా అన్ని కోట్ల ఓటీటీలో ప్ర‌జ‌ల‌కు చూపించి థ్రిల్ కి గురి చేయాల‌ని ఆకాంక్షించింది. కానీ ఇప్పుడు సెన్సార్ బోర్డ్ క‌ట్స్ చెప్పిన థియేట్రిక‌ల్ వెర్ష‌న్ ని మాత్ర‌మే భార‌త‌దేశంలో ఓటీటీలోను రిలీజ్ చేయాల‌ని చెప్ప‌డం స‌ద‌రు సంస్థ‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచిన‌ట్టు తెలుస్తోంది. దీంతో క‌నీసం ఓటీటీలో అయినా ఈ సినిమా ఒరిజినల్ లేదా అన్‌కట్ వెర్షన్‌ను వీక్షించాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురుకానుంది.

సెన్సార్ కోత‌లు చాలా కాలం త‌ర్వాత భార‌త‌దేశంలో మళ్లీ విమ‌ర్శ‌నాత్మ‌క చ‌ర్చ‌ల‌కు దారితీసింది. ఒక సినిమాకు ఇప్పటికే A సర్టిఫికేట్ ఇచ్చిన త‌ర్వాత‌ ఒరిజినల్ వెర్షన్‌ను చూసే హక్కు వయోజన ప్రేక్షకులకు ఉండాలని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విమర్శకులు గట్టిగా వాదిస్తున్నారు. అయితే సాంప్ర‌దాయవాదులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సృజనాత్మక స్వేచ్ఛతో పాటు సమాజంలోని సాంస్కృతిక భావోద్వేగాలను, సున్నితత్వాన్ని కాపాడటానికి ఇటువంటి కంటెంట్ ప్రమాణాలు.. నియంత్రణలు ఎంతో అవసరమని వాదిస్తున్నారు.