మెగాస్టార్ కి ఆ బ్యూటీ లక్కీ ఛార్మ్!
ఈ సినమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇలా చిరంజీవి తో క్యాథరీన్ రెండు సార్లు నటించి అన్నయ్య సక్సెస్ లో భాగమైంది.
By: Srikanth Kontham | 25 Jan 2026 3:00 PM ISTమెగాస్టార్ చిరంజీవికి ఆ బ్యూటీ లక్కీ ఛార్మ్ గా కలిసొచ్చిందా? చిరంజీవి సినిమాలో ఆమె భాగమైన ప్రతీ సందర్భం లోనూ హిట్ అందుకున్నారా? అంటే అవుననే అనాలి. ఇంతకీ ఎవరా నటి? చిరుతో కలిసి తెరను పంచుకున్న అదృష్టవంతు రాలు ఎవరో? తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇటీవలే చిరంజీవి నటించిన `మనశంకర వరప్రసాద్ గారు` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం తో వందల కోట్ల వసూళ్లను సాధించింది. ఇందులో చిరంజీవికి జోడీగా నయన తార నటించింది. ఇద్దరి కాంబినేషన్ కు మంచి మార్కులు పడ్డాయి.
మరి ఆమెనా? లక్కీ చార్మ్ అంటే కాదు. ఆ నటి క్యాథరీన్ ట్రెసా. శంకర వరప్రసాద్ లో అమ్మడు చిరంజీవి టీమ్ లో సభ్యురాలిగా నటించింది. ఆ పాత్ర కామిక్ గా వర్కౌట్ అయింది. కొంత కాలంగా అవకాశాలు రాకపోవడంతో క్యాతరీన్ వచ్చిన పాత్రలతో బండి లాగిస్తుంది. అలా చిరంజీవి సినిమాలో భాగమై మంచి విజయం అందుకుంది. అంతకు ముందు అదే చిరంజీవి తో కలిసి మరో సినిమా చేసింది. అదే `వాల్తేరు వీరయ్య`. ఇందులో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటించినా ఓ కీలక పాత్రలో క్యాథరీన్ నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇలా చిరంజీవి తో క్యాథరీన్ రెండు సార్లు నటించి అన్నయ్య సక్సెస్ లో భాగమైంది. అలాగే చిరంజీవి కంబ్యాక్ అయిన `ఖైదీ నెంబర్ 150` లో కూడా ఈ భామ ఐటం పాటలో నటించాలి. తొలుత క్యాథరీన్ ను ఓ పాట సహా పాత్ర కోసం దించాలని దర్శకుడు వినాయక్ అనుకున్నాడు. కానీ అనూహ్యంగా పాట కోసం రాయ్ లక్ష్మిని తీసుకున్నారు. రిలీజ్ అనంతరం `ఈఖైదీ నెంబర్ 150` కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా కూడా 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఇలా క్యాథరీన్ ట్రెసా చిరంజీవి సినిమాలో ఓ సక్సెస్ సెంటిమెంట్ గా మారింది. ఇప్పటికే హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. వచ్చిన అవకాశాలతో సర్దుకుని ముందుకెళ్తుంది. మరి చిరంజీవి భవిష్యత్ ప్రాజెక్ట్ ల్లో కూడా క్యాథరీన్ ను భాగం చేస్తారా? అన్నది చూడాలి. సాధారణంగా నటీనటుల విషయంలో చిరంజీవి కూడా కల్పించుకుంటారు. దర్శకుడితో కలిసి చర్చిస్తారు. అన్నయ్య ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సూచించిన వారిని తీసుకుంటారు. త్వరలో చిరంజీవి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో జాయిన్ అవుతారు. ఇందులో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదు.
