Begin typing your search above and press return to search.

నీ టైం అయిపోయింది భయ్యా..!

క్యారీ మినాటి రోస్టింగ్‌ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే తరహా పద్దతిని ఫాలో అవుతున్నాడు అనేది పెద్ద కంప్లైంట్‌.

By:  Ramesh Palla   |   28 Jan 2026 11:00 PM IST
నీ టైం అయిపోయింది భయ్యా..!
X

ఒకప్పుడు సినిమా స్టార్స్‌ను మాత్రమే ప్రేక్షకులు గుర్తించే వారు, ఆ తర్వాత టీవీలో కనిపించే వారికి మంచి గుర్తింపు లభించింది. సినిమా, టీవీ సీరియల్స్ స్టార్స్ రెండు మూడు దశాబ్దాల పాటు వెలుగు వెలిగారు. గత పదేళ్లుగా సోషల్‌ మీడియా స్టార్స్‌ టైం నడుస్తోంది. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సోషల్‌ మీడియా ఇన్య్ఫూలెన్సర్‌ లు క్రేజ్‌ ను దక్కించుకుంటున్నారు. హిందీకి చెందిన కొందరు యూట్యూబర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా స్టార్‌ హీలకు ఉన్న పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. వారు ఒక్క సినిమాలో నటించకున్నా, ఒక్క సీరియల్‌ లో కనిపించకున్నా కూడా కేవలం సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ వంటి మాధ్యమం ద్వారా ప్రేక్షకులకు చేరువ కావడం ద్వారా స్టార్‌ డం దక్కించుకున్నారు. అలా స్టార్‌ డం దక్కించుకున్న వారిలో అజే నగర్‌ ఒకడు. అనే నగర్ అంటే వెంటనే గుర్తు పట్టక పోవచ్చు, కానీ క్యారీ మినాటి అంటే మాత్రం వెంటనే కోట్లాది మంది గుర్తుపట్టేస్తారు.

ఆసియాలోనే నెం.1 రోస్టర్‌...

హిందీలో మొదటి రోస్టర్‌ యూట్యూబర్‌ గా క్యారీ మినాటి నిలిచాడు. ఒకానొక సమయంలో ఆసియాలోనే నెం.1 రోస్టర్‌ యూట్యూబర్‌ గా నిలిచిన ఘనత ఈయనకి దక్కింది. ప్రతి విషయాన్ని ఓ రేంజ్‌ లో రోస్ట్‌ చేయడం ఈయనకు తెలుసు అని, ఈయన చేతిలో పడొద్దు బాబోయ్‌ అని చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌, ఫిల్మ్‌ స్టార్స్ అనుకునే వారు. అంతగా ఆయన వీడియోలు సోషల్‌ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకున్నాయి. వందల మిలియన్‌ల వ్యూస్‌ ను ఈయన వీడియోలు సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. ఇండియాలో అత్యధిక యూట్యూబ్‌ ఆదాయం ఉన్న యూట్యూబర్‌ గా క్యారీ మినాటి ఉన్నాడు. అలాంటి క్యారీ మినాటి మెల్ల మెల్లగా ఫేడ్‌ ఔట్‌ అవుతున్నాడు అంటూ ఆయన అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఇంకా మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్‌ అవుతోంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోల స్థాయిలో

క్యారీ మినాటి రోస్టింగ్‌ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే తరహా పద్దతిని ఫాలో అవుతున్నాడు అనేది పెద్ద కంప్లైంట్‌. ఆయన ఎన్ని విధాలుగా సోషల్‌ మీడియాలో వీడియోలు చేసినా కూడా జనాలు అదే తరహా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా క్యారీ మినాటి చేసిన వీడియో సైతం విమర్శలు ఎదుర్కొని, ట్రోల్‌ మెటీరియల్‌గా మారింది. కాఫీ విత్ కరణ్ జోహార్‌ అనే టాక్‌ షో ను రోస్ట్‌ చేయడం కోసం కాఫీ విత్‌ జలాన్ అని ఒక ఎపిసోడ్‌ ను చేయడం జరిగింది. ఒక కార్యక్రమానికి రోస్టింగ్‌ గా చేయబడ్డ వీడియోను ఇతర విమర్శకులు, రోస్టర్‌ లు రోస్ట్‌ చేయడం మొదలు పెట్టారు. క్యారీ మినాటి పనైపోయింది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన్ను అభిమానించే వారు చాలా మంది స్పందిస్తూ క్యారీ మినాటి టైం అయిపోయినట్టు అనిపిస్తుందని వ్యాఖ్యలు చేస్తూ, ఇక మీదట రోస్టింగ్‌ చేయడం ఆపేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

క్యారీ మినాటి యొక్క యూట్యూబ్ జర్నీ

క్యారీ మినాటి ఆసియాలోనే రోస్టింగ్‌ లో నెం.1 స్థానం సొంతం చేసుకున్నాడు. ఆయన్ను చూసి వందల కొద్ది రోస్టర్‌లు యూట్యూబ్‌ ద్వారా వెలుగులోకి వచ్చారు. వారు అంతా కొత్త ఐడియాలతో వస్తూ ఉంటే, క్యారీ మాత్రం ఇంకా పాత పద్దతిలోనే రోస్టింగ్‌ చేస్తే ఎవరు చూస్తారు అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలం మారుతున్నా కొద్ది మనం మారాల్సిన అవసరం ఉంది. అలా మారకుండా పాత పద్దతిలోనే కొనసాగుతాను అంటే మాత్రం మొత్తం రివర్స్ అవుతుంది. గతంలో ఆయన రోస్టింగ్‌ ను ఇష్టపడే వారు పెద్ద వారు అయ్యారు, వారు ఇప్పుడు రోస్టింగ్‌ వీడియోలు చూసే అవకాశం కనిపించడం లేదు. కొత్తగా వచ్చిన వారిని మెప్పించాలంటే కొత్తగా రోస్టింగ్‌ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ క్యారి మినాటి మాత్రం ఇంకా పాత చింతకాయ పచ్చడి వంటి రోస్టింగ్‌ చేస్తూ, ఏదో పేరడీ లు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు అనేది విశ్లేషకుల మాట. ముందు ముందు క్యారీ మినాటి పూర్తిగా కనిపించకుండా పోయే రోజులు ఉన్నాయని కొందరు అంటున్నారు.