Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌: కేర్‌లెస్‌ ప్రొడ్యూస‌ర్స్‌..అండ్‌ డైరెక్ట‌ర్స్‌!

సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌ధానంగా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియ‌న్‌ల నుంచి వినిపించే మాట ఒక్క ఛాన్స్‌.

By:  Tupaki Entertainment Desk   |   17 Feb 2026 12:00 AM IST
టాలీవుడ్‌: కేర్‌లెస్‌ ప్రొడ్యూస‌ర్స్‌..అండ్‌ డైరెక్ట‌ర్స్‌!
X

సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌ధానంగా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియ‌న్‌ల నుంచి వినిపించే మాట ఒక్క ఛాన్స్‌. అలా ఒక్క ఛాన్స్ వ‌స్తే త‌మ‌ని తాము నిరూపించుకుంటామ‌ని, సిల్వ‌ర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తామ‌ని అవ‌కాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఒక్క ఛాన్స్ ఇస్తే క‌ళ్ల‌కు అద్దుకుని త‌న‌కు మించి అదృష్టవంతులు లేర‌ని అంతులేని ఆనందంతో రాత్రి, ప‌గ‌లు అని తేడా లేకుండా క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తారు. త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌, డైరెక్ట‌ర్ బాగుండాల‌ని కోరుకుంటారు. ఒక్క ఛాన్స్ అభిస్తే త‌మ టాలెంట్‌ని నిరూపించుకోవాల‌ని కృష్ణాన‌గ‌ర్, ఇందిరా న‌గ‌ర్ వీధుల్లో ఇప్ప‌టికీ పిచ్చివాళ్ల‌లా తిరుగుతున్నా వాళ్లేందరో..

టాలెంట్‌ని నిరూపించుకోవాల‌ని తిండిలేక‌, రాత్రికి నిద్ర‌లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న వారు కొంద‌రైతే వ‌చ్చిన అవ‌కాశాన్ని చాలా కేర్ లెస్‌గా డీల్ చేస్తూ ఫ్లాపులు, డిజాస్ట‌ర్‌లు అందించి ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీలోనే సర్వైవ‌ల్ అవుతున్న వాళ్లు మ‌రి కొంద‌రు. ఇందులో డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్సే ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నారు. ఇందులో యూఎస్‌లో ఉన్న పార్ట్న‌ర్స్ నుంచి వ‌చ్చే బ్లాక్ మ‌నీతో సినిమాలు తీసే ప్రొడ్యూస‌ర్స్ కొంత మందైతే... ప్రొడ్యూస‌ర్స్‌గా ఎస్టాబ్లిష్ అయిన ప్రొడ్యూస‌ర్స్ కూడా ఉన్నారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌, స్టార్‌ల స‌పోర్ట్ ఉన్న డైరెక్ట‌ర్ల‌ది కూడా ఇదే స్కూలు.

వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోకుండా ప‌క్కా డిజాస్ట‌ర్ల‌ని సెట్ చేసి మ‌రీ సినిమాలు తీస్తున్నారా? అనేంత‌గా భారీ డిజాస్ట‌ర్ల‌ని అందిస్తున్నారు. ప్ర‌ముఖ కంప‌నీలో ఏళ్ల‌కు ఏళ్లు డైరెక్ట‌ర్లుగా ఉంటున్న వారితో పాటు స్టార్ ఫ్యామిలీ బ్యాంగ్రౌండ్ ఉన్న డైరెక్ట‌ర్లు కూడా ఎలాంటి కేర్ తీసుకోకుండా ఒక్క మాట‌లో చెప్పాలంటే కేర్ లెస్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ కోట్లు ఖ‌ర్చు పెట్టిస్తూ డిజాస్ట‌ర్లు అందిస్తున్నారు. కొంత మంది డైరెక్ట‌ర్లు అయితే సెట్‌లోనే క‌థ‌లు రాయ‌డం చేసి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

దాంతో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ అంటూ ప్ర‌మోట్ చేసిన సినిమాలు కూడా బాక్సాపీస్ వ‌ద్ద రిలీజైన రోజే డిజాస్ట‌ర్ అని పించుకున్నాయి. దానికి ప్రొడ్యూస‌ర్స్ నిర్ల‌క్ష్యం కూడా ఓ కార‌ణం. క‌థ‌, క‌థ‌నాల‌ని ప‌ట్టిచుకోకుండా ఫ్లాప్ అయినా ఫ‌ర‌వాలేదు..సినిమా తీసేశాం..నో ప్ర‌మోష‌న్స్ అంటూ రిలీజ్ చేయ‌డం...అనుకున్న స్థాయిలో సినిమా ప్ర‌మోష‌న్స్ చేయ‌క‌పోడం సినిమా ఫ్లాప్‌కు ప్ర‌ధాన కార‌ణాలు అవుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో చిన్న హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వ‌ర‌కు న‌టించిన సినిమాలని ఒక్క‌సారి ప‌రిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది.

కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమా నిర్మాణం విష‌యంలో కానీ, స్టోరీ విష‌యంలో కానీ జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం, డైరెక్ట‌ర్ల‌ని గుడ్డిగా న‌మ్మి ప్రాజెక్ట్‌ల‌ని అప్ప‌గించ‌డం.. డైరెక్ట‌ర్లు కూడా చాలా తేలిక‌గా తీసుకుని త‌మ‌కు న‌చ్చిందే ప‌ర్‌ఫెక్ట్ అని సినిమాని త‌ప్పుదారి ప‌ట్టించ‌డం..ఫ‌లితంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్ట‌ర్లని ఎదుర్కోవ‌డం ప‌రిపాటిగా మారింది. ఇప్ప‌టికైనా పెరిగిన టెక్నాల‌జీని, మారిన ప్రేక్ష‌కుడి అభిరుచిని గుర్తించి డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్‌లు త‌మ‌కు న‌చ్చింది కాకుండా జ‌నం మెచ్చింది చేస్తార‌ని ఆశిద్దాం.