విజయ్ కాంత్ కుమారుడితో 'కెప్టెన్ ప్రభాకర్ 2'
విజయ్ కాంత్ ప్రధానపాత్రలో ఆర్కే సెల్వమణి రూపొందించిన `కెప్టెన్ ప్రభాకర్`(1991) ఇండియన్ సినిమా హిస్టరీలో మేటి క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది.
By: Sivaji Kontham | 28 Aug 2025 9:26 AM ISTవిజయ్ కాంత్ ప్రధానపాత్రలో ఆర్కే సెల్వమణి రూపొందించిన 'కెప్టెన్ ప్రభాకర్'(1991) ఇండియన్ సినిమా హిస్టరీలో మేటి క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచింది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో విజయ్ కాంత్ అటవీ శాఖ అధికారి(ఐ.ఎఫ్.ఎస్) అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కథానాయికగా నటించారు. వీరభద్రన్ పాత్రలో మన్సూర్ అలీఖాన్ నటనకు గొప్ప పేరొచ్చింది.
ఇప్పుడు ఈ సినిమాని దాదాపు 34 ఏళ్ల అనంతరం రీమాస్టర్ చేసి నాణ్యమైన వెర్షన్ ని రీరిలీజ్ చేయగా, అద్భుత స్పందన వచ్చింది. విజయ్ కాంత్ ఫ్యాన్స్ థియేటర్లలో సందడి చేసారు. చిత్ర దర్శకుడు ఆర్కే సెల్వమణి ఈ క్లాసిక్ సినిమాని వీక్షించేందుకు కెప్టెన్ అభిమానులతో పాటు పాత జనరేషన్, యువతరం కూడా విచ్చేయడంపై ఆనందం వ్యక్తం చేసారు. నేటి జెన్ జెడ్ కిడ్స్ కూడా థియేటర్లలో సినిమాని వీక్షించేందుకు ఆసక్తిని కనబరిచారని తెలిపారు.
కెప్టెన్ ప్రభాకర్ కొనసాగింపు కథతో సీక్వెల్ ని తెరకెక్కించే ఆలోచన కూడా ఉందని ఈ సందర్భంగా దర్శకుడు సెల్వమణి వ్యాఖ్యానించారు. విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ కూడా తన తండ్రిలానే నటించగలడు. ఇప్పుడు సీక్వెల్ ని షణ్ముగ పాండియన్ కథానాయకుడిగా రూపొందిస్తామని కూడా తెలిపారు. కెప్టెన్ ప్రభాకర్ (ఐఎఫ్ఎస్) కథతో సమానమైన స్థాయి ఉన్న కథను రూపొందిస్తామని కూడా చెప్పారు.
