మధ్యలో ఆగిపోయిన చిత్రం 2026లో రీస్టార్ట్!
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో టైర్ 2 హీరోల్లో ముందున్నాడు.
By: Srikanth Kontham | 15 Aug 2025 3:00 AM ISTబాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో టైర్ 2 హీరోల్లో ముందున్నాడు. `చందు ఛాంపియన్`, `భూల్ భులయ్య 3` లాంటి విజయాలతో కార్తీక్ స్టార్ డమ్ రెట్టింపు అయింది. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి మ్యూ జికల్ రొమాంటిక్ చిత్రం కాగా, మరోటి `తూ మేరి మేయిన్ తేరా మెయిన్ తేరా తూ మేరీ` చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధ్యలో ఆగిపోయిన చిత్రం సైతం తిరిగి పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది.
కార్తీక్ ఆర్యన్ హీరోగా హన్సల్ మెహతా దర్శకత్వంలో `కెప్టెన్ ఇండియా` చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెగ్యులర్ షూటింగ్ కి సన్నాహాకాలు చేస్తోన్న సమయంలో అనూహ్యంగా ప్రాజెక్ట్ ను ఆపేసారు. తాజాగా ఈ చిత్రాన్ని మళ్లీ తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. అయితే దర్శకుడు మాత్రం మారుతున్నాడు. హన్సల్ మెహతా స్థానంలో `చక్ దే ఇండియా` డైరెక్టర్ షమీత్ అమీన్ ఆ బాధ్య తలు తీసుకుంటున్నాడు. కొన్ని రోజులుగా ఈప్రాజెక్ట్ గురించి షమీత్-ఆర్యన్ మధ్య చర్చలు జరుగు తున్నాయి.
చివరిగా ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రధ మార్ధంలో చిత్రాన్ని పట్టాలె క్కించాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రాజెక్ట్ వివరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. షమీత్ అమీన్ కొంత కాలంగా డైరెక్షన్ దూరంగా ఉన్నాడు. 2020 నుంచి సినిమాలు తెరకెక్కించడం లేదు. ఈ నేపథ్యంలో ఐదేళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కడం విశేషం. డైరెక్టర్ గా అమీత్ కెరీర్ ప్రారంభమై రెండు దశాబ్దలైనా చేసిన సినిమాలు చాలా తక్కువే. మూడు సినిమాలే తెరకెక్కించారు. మరికొన్ని సినిమాలకు వివిధ విభాగాల్లో పని చేసారు.
కానీ `చక్ దే ఇండియా` సినిమాతో డైరెక్టర్ గా ప్రత్యేక స్థానం సంపాదించాడు . ఆ విజయంతో దేశ వ్యాప్తంగా అమీత్ పేరు మారుమ్రోగిపోయింది. 20 కోట్ల బడ్జెట్ లోనే తెరకెక్కించిన సినిమా 109 కోట్ల వసూళ్లను రాబట్టింది. కానీ ఆ తర్వాత అదే సక్సెస్ ని కొనసాగించలేదు. డైరెక్టర్ గానూ సీరియస్ గా సినిమాలు చేయ లేదు. 2020 లో `ఏ సూటబుల్ బోయ్` టీవీ సిరీస్ ని తెరకెక్కించాడు. ఆ తర్వాత మళ్లీ మరో సినిమా చేయలేదు.
