Begin typing your search above and press return to search.

ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి.. బివిఎస్ రవి మాస్ కౌంటర్!

సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాలో ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ గురించి రవి ప్రస్తావించారు.

By:  M Prashanth   |   22 Aug 2026 10:13 AM IST
ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి.. బివిఎస్ రవి మాస్ కౌంటర్!
X

మెగాస్టార్ చిరంజీవి మీద సోషల్ మీడియాలో ఈమధ్య రకరకాల కామెంట్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఏం చేసినా అందులో తప్పులు వెతికే బ్యాచ్ ఒకటి ఎప్పుడూ ఆన్ లైన్ లో రెడీగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ ఒక రేంజ్ లో ఆన్సర్ ఇచ్చారు రైటర్ కమ్ డైరెక్టర్ బివిఎస్ రవి. చిరు 71వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట మామూలు సౌండ్ చేయడం లేదు. ట్రోలర్స్ కు దిమ్మతిరిగేలా ఆయన వేసిన పంచ్ లు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి.

చిరంజీవి రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పడానికి రవి ఒక మంచి పాయింట్ లాగారు. చిరంజీవి బయట ఎలా ఉంటారో ఆయన తీసిన సినిమాల్లోని క్యారెక్టర్లు కూడా దాదాపు అలాగే ఉంటాయని చెప్పారు. పది మందికి ఎలాంటి కష్టం వచ్చినా సాయం చేయడానికి ముందుండటం ఆయన నైజం అన్నారు. పది మంది బాధ పడుతుంటే అది తన బాధగా ఫీల్ అవుతారని, పది మంది సంతోషంగా ఉంటే వాళ్ళను చూసి ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పుకొచ్చారు. కావాలంటే ఆయన నటించిన ఏ సినిమా అయినా ఒకసారి చెక్ చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు.

కేవలం టాలెంట్ మాత్రమే కాదు, ఆయనలో ఉన్న ఆ మంచి మనసు వల్లే ఈరోజు చిరంజీవి అంతటి ఉన్నత స్థానంలో ఉన్నారని రవి స్పష్టం చేశారు. ఎవరూ చేరుకోలేనంత ఎత్తులో ఒక ధ్రువతార లాగా ఆయన నిలబడటానికి అసలు కారణం ఆ సేవాగుణమే అని మెచ్చుకున్నారు. అందుకే ఆయన ఇప్పుడు ఆ కుర్చీలో, ఆ స్థానంలో అంత స్ట్రాంగ్ గా కూర్చున్నారని చెప్పారు. ఆయన స్థాయికి ఎవరూ వంక పెట్టలేరని, ఆయన రేంజ్ ఎప్పటికీ ఎవరికీ అందనంత ఎత్తులోనే ఉంటుందని రవి తన స్పీచ్ లో చాలా బలంగా తెలియజేశారు.

సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాలో ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ గురించి రవి ప్రస్తావించారు. ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ఏవేవో పిచ్చి వాగుడు వాగే వాళ్ళ గురించి ఆయన గట్టిగానే ఫైర్ అయ్యారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ, చిరంజీవి స్థాయిని తగ్గించేలా రకరకాల జోకులు వేసుకునే బ్యాచ్ ను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని పిచ్చి వాళ్ళ లాగా ప్రవర్తించే వాళ్ళకు చిరంజీవి రేంజ్ ఏంటో ఎప్పటికీ అర్థం కాదని ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

ఇలా ఆన్ లైన్ లో వచ్చే కామెంట్స్ చూసి మెగా అభిమానులు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని రవి సలహా ఇచ్చారు. బ్రదర్స్ మీరెవరూ వాళ్ళను చూసి ఫీల్ అవ్వకండి అని ఫ్యాన్స్ కు చెప్పారు. ఆ నెగిటివ్ బ్యాచ్ ఉద్దేశపూర్వకంగా చేసే కామెంట్స్ కు మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదని, వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళ మాటల్లే చెబుతున్నాయని అన్నారు.

ఇక తన స్పీచ్ ముగింపులో ట్రోల్ చేసేవాళ్లను ఉద్దేశించి రవి ఒక మాస్ డైలాగ్ వాడారు. ఒక ఏనుగు తన దారిన తాను వెళ్తూ ఉంటే, దాన్ని చూసి కుక్కలు మొరుగుతూనే ఉంటాయని ఒక పవర్ ఫుల్ సెటైర్ వేశారు. వాళ్ళను అలాగే మొరగనివ్వండి, కుక్కలకు కూడా వీధికి కాపలా కాసే పని ఒకటుంది కదా అంటూ గట్టిగా పంచ్ వేశారు. ఆ వీధి కాపలా పని వాళ్ళకే వదిలేద్దాం, వాళ్ళు చేసే పని అదే అంటూ రవి తన స్పీచ్ ను ఎండ్ చేసిన తీరు అక్కడున్న ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించింది.