దీపిక వర్కింగ్ అవర్స్.. బన్నీవాసు రియాక్షన్ ఏంటో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ప్రతిపాదించిన 8 గంటల పని విధానంపై కొంతకాలంగా జోరుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 16 Oct 2025 9:11 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ప్రతిపాదించిన 8 గంటల పని విధానంపై కొంతకాలంగా జోరుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అనేక మంది సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. వర్కింగ్ అవర్స్ విషయంలో కొందరు దీపికకు మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొందరు విభేదిస్తున్నారు.
రీసెంట్ గానే దీపిక డైరెక్ట్ గా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఆ విషయంపై డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆ టాపిక్ ను ఎవరూ వదలడం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తాజాగా నిర్మాత బన్నీ వాసు ఎదుట ప్రస్తావించారు. ఆయన సమర్పించిన మిత్రమండలి ప్రెస్ మీట్ లో ప్రశ్న ఎదురైంది.
"టాలీవుడ్ లో ఇష్యూ నడుస్తోంది. దీపిక పదుకొణె వర్కింగ్ అవర్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది. రెండు సినిమాల నుంచి తప్పుకున్న ఆమె.. ఇప్పుడు అల్లు అర్జున్- అట్లీ మూవీలో చేస్తుంది. అక్కడ వర్కింగ్ అవర్స్ ఎలా చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు?" అని అడగ్గా.. వెంటనే బన్నీ వాసు ఏ సినిమాకు అయినా కష్టం ఉంటుందని తెలిపారు.
"మిత్రమండలి డైరెక్టర్ విజయ్ కు ఏమైందటే.. లాస్ట్ కు వరకు సినిమా షూట్ చేయాల్సి వచ్చింది. క్లైమాక్స్ లో హీరోయిన్ నిహారిక ఎన్.ఎం వల్ల నలుగురు కలిసి కొట్టుకుంటారు. ఆ సీన్ షూటింగ్ టైమ్ లో ఆమెకు 101 ఫీవర్. అది తప్పితే సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వస్తుంది. రోజూ చల్లగా ఉంది. ఆరోజు చాలా ఎండ" అని బన్నీవాసు తెలిపారు.
"కానీ ఆమె 101 ఫీవర్ తో వచ్చి చేస్తుంది. పొద్దున్న 6కు వచ్చి సాయంత్రం 4 వరకు నిల్చునే ఉంది. నేను షూటింగ్ ఆపేద్దామా.. ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగా.. లేదు సర్ షూటింగ్ పూర్తి చేద్దామని చెప్పింది. చాలా నెలలకు సినిమా సెట్స్ పై ఉంది. బ్రేక్ వద్దనింది. ఆ తర్వాత విజ్జు వచ్చి ఇంకో నాలుగు షాట్లు మిగిలిపోయాయని చెప్పాడు" అని చెప్పారు.
"అప్పుడు రాత్రి 9 గంటలకు షూట్ చేశాం. మరో ప్లేస్ కు వెళ్లి చిత్రీకరణను చేశం. సినిమా ఫినిష్ చేయాలి కాబట్టి చేశాం. నిహారిక చాలా వీక్ అయింది. సినిమా కోసం అన్నీ పణంగా పెట్టి పని చేశాం. ఇక దీపికా పదుకొణే విషయానికొస్తే.. తాను చిన్నోడ్ని, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను అప్పుడే నాకెందుకు.." అంటూ బన్నీ వాసు ఫుల్ గా నవ్వేశారు.
