Begin typing your search above and press return to search.

యాక్టర్ గా మారబోతున్న మరో నిర్మాత.. బన్నీ వాస్ ఇన్ డైరెక్ట్ కామెంట్!

బన్నీ వాస్ మాట్లాడుతూ.. మా బ్యాచ్ నుండి త్వరలో ఇండస్ట్రీకి ఇంకొక యాక్టర్ లాంచ్ కాబోతున్నారు. పేరు చెప్పాలని ఉంది కానీ సాయంత్రం వెళ్తే నన్ను చంపేస్తాడు.

By:  Madhu Reddy   |   28 Jun 2026 12:43 AM IST
యాక్టర్ గా మారబోతున్న మరో నిర్మాత.. బన్నీ వాస్ ఇన్ డైరెక్ట్ కామెంట్!
X

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఉండే 24 విభాగాలలో కచ్చితంగా జ్ఞానం సంపాదించుకోవాలని సెలబ్రిటీలు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు.. అందులో బాగానే దర్శకులు.. మ్యూజిక్ డైరెక్టర్ , హీరోలుగా మారి సత్తా చాటుతుంటే.. ఇటు హీరోలు.. సింగర్స్ గా, నిర్మాతలుగా మారి తమ టాలెంటును నిరూపించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక నిర్మాత నటుడిగా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఈ విషయాన్ని అధికారికం చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఆ నిర్మాత ఎవరు? ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు అనే విషయాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

గీత ఆర్ట్స్2 బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్న బన్నీ వాసు తాజాగా 'గుర్తుకొస్తున్నాయి' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొని ఇండస్ట్రీలోకి రాబోతున్న యాక్టర్ గురించి చెప్పుకొచ్చారు. బన్నీ వాస్ మాట్లాడుతూ.. మా బ్యాచ్ నుండి త్వరలో ఇండస్ట్రీకి ఇంకొక యాక్టర్ లాంచ్ కాబోతున్నారు. పేరు చెప్పాలని ఉంది కానీ సాయంత్రం వెళ్తే నన్ను చంపేస్తాడు. అతను మాత్రం స్క్రీన్స్ చింపేస్తాడు. అతనికి వచ్చే రెమ్యూనరేషన్ ను కూడా నాకు ఇవ్వమని చెప్పాను. అంటూ బన్నీ వాసు చెబుతుండగానే.. కింద నుంచి ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని అలాగే ఎస్కేఎన్ అన్ని చెప్పేసేయ్ అన్నారు.

బన్నీ వాసు మాత్రం అది ఆ యాక్టర్ లాంచింగ్ తర్వాత చేద్దాం. క్రేన్ల నుంచి దింపడం, కింద నుంచి బ్లాస్ట్ చేయడం లాంటివి చేద్దాం.. కానీ అతడికి ఏమీ కాకుండా చూసుకోవాలి.. అంటూ కామెంట్లు చేశారు. ఇక బన్నీ వాసు చేసిన కామెంట్లను బట్టి చూస్తే అటు ఎస్కేఎన్ లేదా ధీరజ్ ఇద్దరిలో ఎవరో ఒకరు యాక్టర్ గా మారబోతున్నారా లేదా మరో కొత్త నిర్మాత నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

గుర్తుకొస్తున్నాయి సినిమా విషయానికి వస్తే.. విరాజ్ అశ్విన్ , యశ శ్రీ రావు జంటగా వస్తున్న తెలుగు ఒరిజినల్ సిరీస్ ఇది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ వేదికగా జూలై మూడవ తేదీ నుండి ప్రసారం కానుంది. 90స్ జ్ఞాపకాలతో పాటు హీరో, స్నేహితుల మధ్య కామెడీ టైమింగ్ తో రూపొందించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాయి. రోహిణి హట్టం గడి, పవన్ సిద్దు, ప్రియదర్శిని రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. కామెడీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి ఇక ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.