"ఒక రాత్రంతా డిస్టర్బ్ అయ్యా.. గుండె తరుక్కుపోయింది": బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్
"ఈ సినిమా గురించి స్ట్రెయిట్‌గా చెప్పాలంటే, ఇది నిజంగా జరిగిందని తెలియకుండా చూస్తే, ఇలాంటి కథ రాసిన వాడిని, తీసిన వాడిని ఇంత అవసరమా అంటాం
By: M Prashanth | 29 Oct 2025 4:35 PM ISTలిటిల్ హార్ట్స్' లాంటి బ్లాక్‌బస్టర్‌ను ఆడియెన్స్‌కు అందించిన సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు, ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇది రొటీన్ లవ్ స్టోరీ కాదని, చూసిన వాళ్ల గుండెల్ని పిండేసే నిజ జీవిత కథ అని ఆయన కుండ బద్దలు కొట్టారు.
"ఈ సినిమా గురించి స్ట్రెయిట్‌గా చెప్పాలంటే, ఇది నిజంగా జరిగిందని తెలియకుండా చూస్తే, ఇలాంటి కథ రాసిన వాడిని, తీసిన వాడిని ఇంత అవసరమా అంటాం. అసలు ఒక మనిషి ఇలా కూడా ఆలోచిస్తాడా?" అని బన్నీ వాసు తన ఆలోచనను వ్యక్తం చేశారు. ఆయన మొదట సినిమా చూసినప్పుడు, ఇది కేవలం ఫిక్షన్ అనుకున్నారట, "సినిమా కోసం మరీ ఇంత హార్ష్‌గా వెళ్లాలా?" అని డైరెక్టర్‌ను అడగాలనుకున్నారట.
కానీ, నిర్మాత వేణు ఊడుగుల ఇది నిజంగా జరిగిన కథ అని రివీల్ చేసినప్పుడు, బన్నీ వాసు పూర్తిగా స్టన్ అయినట్లు చెప్పారు. "ఆ మాట వినగానే నా గుండె తరుక్కుపోయింది. నిజంగా షాక్ అయ్యాను. ఒక రాత్రంతా నేను ఆ సినిమా గురించే ఆలోచిస్తూ డిస్టర్బ్ అయ్యాను" అని తన ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నారు. మన సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నమ్మలేకపోయానని ఆయన అన్నారు.
నిజానికి, బన్నీ వాసు లాంటి కమర్షియల్ సక్సెస్‌లు చూసిన నిర్మాతను కూడా ఇంతలా కదిలించిందంటే, ఆ కథలో ఎంత నిజాయితీ, ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'లిటిల్ హార్ట్స్' లాంటి ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను బ్లాక్‌బస్టర్ చేసిన టీమ్, ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఇంత ఇంటెన్స్, డిస్టర్బింగ్ కథను నమ్మి థియేటర్లలోకి తీసుకురావడం వెనుక వాళ్ల కాన్ఫిడెన్స్ ఏంటో ఈ మాటలు చెబుతున్నాయి. ఇది రెగ్యులర్ హిట్ ఫార్ములా కాదు, కంటెంట్‌ను నమ్మి చేస్తున్న ప్రయోగం అని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతీ ఆడియెన్ కచ్చితంగా ఒక భారమైన ఫీలింగ్‌తో, గుండె బరువుతో వస్తారని బన్నీ వాసు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. డైరెక్టర్ సాయిలు కంపాటి టేకింగ్‌ను కూడా ఆయన మెచ్చుకున్నారు. ఇంత సెన్సిటివ్, ఇంటెన్స్ సబ్జెక్ట్‌ను ఎక్కడా డ్రాప్ అవ్వకుండా, ఒక ఫ్లోలో చాలా బాగా తీసుకెళ్లాడని ప్రశంసించారు. బన్నీ వాసు మాటలు వింటుంటే, 'రాజు వెడ్స్ రాంబాయి' ఒక పవర్ ఫుల్, హార్డ్ హిట్టింగ్ డ్రామాగా ఉండబోతోందనిపిస్తోంది. ఇక ఈ సినిమా నవంబర్ 21న్ విడుదల కానుంది.
