ఆ సినిమా ఫ్లాప్ అని అప్పుడే అర్థమైంది
కొందరి జడ్జిమెంట్ పై ఆడియన్స్ కు మంచి నమ్మకం ఉంటుంది. అలాంటి వారిలో టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు కూడా ఒకరు.
By: Sravani Lakshmi Srungarapu | 30 Dec 2025 6:26 PM ISTకొందరి జడ్జిమెంట్ పై ఆడియన్స్ కు మంచి నమ్మకం ఉంటుంది. అలాంటి వారిలో టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు కూడా ఒకరు. ఆయన్నుంచి ఓ సినిమా వస్తుందంటే సినిమా మినిమం గ్యారెంటీ ఉంటుందని ఆడియన్స్ కు ఓ నమ్మకం ఏర్పడింది. బన్నీ వాసు కి సక్సెస్ రేటు కూడా ఎక్కువే. ఎలాంటి సినిమాలు హిట్ అవుతాయనేది బన్నీ వాసు ముందే అంచనా వేయగలరు.
మంచి అంచనాలతో రిలీజైన మిత్ర మండలి
కానీ రీసెంట్ గా ఆయన్నుంచి వచ్చిన ఓ సినిమా ఆయన అంచనాల్ని తారుమారు చేసింది. బన్నీ వాసు ఈ సినిమా ఆడియన్స్ కు తప్పక నచ్చుతుందని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పిన మూవీనే అతనికి నష్టాల్ని మిగిల్చింది. అదే మిత్ర మండలి మూవీ. బన్నీ వాసు సమర్పణలో విజయేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజైంది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది.
కామెడీ వర్కవుట్ అవుతుందనుకున్నా
టాక్ నెగిటివ్ గా రావడంతో మిత్ర మండలి మంచి కలెక్షన్లను అందుకోలేక ఫ్లాపుగా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి బన్నీ వాసు ఓ సందర్భంగా మాట్లాడుతూ, మిత్ర మండలి వల్ల తమకు రూ.6 కోట్ల నష్టం వచ్చిందని ఒప్పుకున్నారు. అయితే ఆ నష్టం రావడానికి కారణం కూడా తనకు తెలుసని చెప్పారు వాసు. సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూసి, కామెడీ వర్కవుట్ అవుతుందనుకున్నానని, కొన్ని సీన్స్ కు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నానన్నారు.
ఆ సినిమాతో రూ.6 కోట్లు నష్టమొచ్చింది
కానీ సినిమా రిలీజయ్యాక ఆడియన్స్ తో కలిసి చూసేటప్పుడు తాను అనుకున్న సీన్స్ కూడా సరిగా పేలలేదని, జనాల రియాక్షన్ చూసి అప్పుడే తాను ఆ సినిమా ఫెయిల్ అవుతుందని అనుకున్నానని, ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో తప్పు చేశామని, ఫైనల్ కాపీని మరోసారి చూసుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని, కానీ కొన్ని రీజన్స్ వల్ల సినిమాను మరోసారి చూడలేకపోయామని, దాని వల్ల రూ.6 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని బన్నీ వాసు చెప్పడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
