అదొక శాడిజం, సైకోయిజం.. వాళ్ళు భుజాలు తడుముకున్నట్టే: బన్నీ వాస్
"కొందరు జెన్యూన్ గా కామెంట్ పెట్టారు. నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. వాళ్లను అప్రిషియేట్ చేయాలి. సినిమాను తిట్టినవి ఉన్నాయి. అవన్నీ రియల్ కామెంట్స్.
By: M Prashanth | 15 Oct 2025 11:12 PM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సమర్పణలో మిత్ర మండలి మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓఐ తదితరులు లీడ్ రోల్స్ లో నటించిన ఆ సినిమా గురువారం విడుదల కానుంది. దీంతో తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సినిమా ట్రైలర్ పై జరిగిన తప్పుడు ప్రచారం సహా పలు విషయాలపై మాట్లాడగా.. అందుకు సంబంధించిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
"ట్రైలర్ 3 నిమిషాలు ఉంది.. రిలీజ్ అయ్యి రెండు నిమిషాలైన వెంట వెంటనే కామెంట్లు వచ్చాయి.. అందులో డైలాగ్స్ మార్చినా బాగుంటుంది.. పది డైలాగ్స్ తర్వాత మళ్లీ సేమ్ ఉంటున్నాయి.. నాకప్పుడు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది అదంతా ఆర్గనైజ్డ్ అని. కొంతమంది దానిపై వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. అదో స్ట్రాటజీ అంట. చెత్త స్ట్రాటజీ. కాంపిటేషన్ అనే కన్నా దీన్ని శాడిజం, సైకోయిజం అనచ్చు. ఇంత కష్టపడి సినిమాలు తీస్తుంటే అలా చేస్తున్నారు" అని అన్నారు.
"కొందరు జెన్యూన్ గా కామెంట్ పెట్టారు. నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. వాళ్లను అప్రిషియేట్ చేయాలి. సినిమాను తిట్టినవి ఉన్నాయి. అవన్నీ రియల్ కామెంట్స్. కానీ ఒకదాన్ని రిపీట్ గా పెడుతున్నారు. దాన్ని బట్టి తెలుస్తోంది. ఎవరో చేస్తున్నారని.. అది క్లియర్ గా తెలుస్తోంది. ఇది చాలా సినిమాలకు జరిగింది. రెండు మూడు సినిమాల రిలీజ్ టైమ్ లో జరిగింది. నిన్న ఓ పెద్ద ప్రొడ్యూసర్ మాట్లాడారు. చాలా బాధపడ్డారు. ఓ హీరో గారు కూడా మాట్లాడారు" అని చెప్పారు.
"నా ఒక్కరికే కాదు ఇది. చాలా మందికి జరిగినా వదిలేస్తున్నారు. ప్రూఫ్స్ ఉండవు. అయితే మాకు తెలుసు అని చెప్పడానికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడా. తమ దగ్గర ఇన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ వున్నాయని చెప్పి నిర్మాతలను కలిసి వాళ్ల సినిమాకు పాజిటివ్ చేయడం లేదా వేరే సినిమాలకు నెగిటివ్ చేయడం చేస్తున్నారు ఇది సరికాదు. తమ సినిమా విజయం అందుకోవాలనే ఉద్దేశంతో మరొకరి సినిమా తొక్కేయాలని చూడటం సరికాదు" అంటూ బన్నీ వాస్ వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత సినిమాలో డైలాగ్స్ కోసం మాట్లాడారు. "కొన్ని కొన్ని డైలాగ్స్ కొంతమంది మీద పడ్డాయి. ఎవరూ అఫెండ్ అవద్దు. నవ్వించడానికి చేశాం. ఉద్దేశపూర్వకంగా కాదు. చాలా క్యాజువల్, జోయల్ గా చేశారు. డిస్క్లైమర్ లో పెట్టమన్నారు.. అది కూడా పెట్టాం" అని బన్నీ వాస్ తెలిపారు. ఆ తర్వాత ప్రియదర్శి మాట్లాడగా.. మీ ఆవేదన వ్యక్తం చేశారు కానీ.. ఇంకొకరి టార్గెట్ చేసినట్లు అయింది. మీరు టార్గెట్ చేసిన దాంట్లో ఒక హీరో పేరు కూడా వచ్చిందని మీడియా ప్రతినిధి అన్నారు. వెంటనే స్పందించిన బన్నీ వాసు, ఇది ఎవరికన్నా తగిలుంటే వాళ్ళు భుజాలు తడుముకున్నట్లేని చెప్పారు.
