Begin typing your search above and press return to search.

చిన్న సినిమాలకు దిల్ రాజే టార్గెటా.. బన్నీ వాసు భలే లాగాడుగా!

టాలీవుడ్ లో పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. థియేటర్ల గొడవలు మొదలవ్వడం కామన్.

By:  M Prashanth   |   12 Oct 2026 10:58 AM IST
చిన్న సినిమాలకు దిల్ రాజే టార్గెటా.. బన్నీ వాసు భలే లాగాడుగా!
X

టాలీవుడ్ లో పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. థియేటర్ల గొడవలు మొదలవ్వడం కామన్. చిన్న సినిమాలకు స్క్రీన్లు దొరకడం కష్టమైనప్పుడు చాలామంది ఫోకస్ దిల్ రాజు వైపే వెళ్తుంటుంది. ఆయన వల్లనే థియేటర్లు రాలేదనే మాటలు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటాయి. సరిగ్గా ఇదే పాయింట్ మీద క్రేజీ కళ్యాణం ఈవెంట్ లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన కొన్ని సరదా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

అక్టోబర్ 16న ఈ చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే దీని బిజినెస్ ప్లానింగ్ చూస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. సినిమా డిస్ట్రిబ్యూషన్ ఏమో ఏషియన్ సురేష్ వాళ్లకు ఇచ్చారు, స్టేజ్ మీద చీఫ్ గెస్ట్ గా మాత్రం దిల్ రాజును నిలబెట్టారు. థియేటర్లు కావాలంటే అటు ఏషియన్ వాళ్లు ఎలాగూ ఇస్తారు, ఇటు గెస్ట్ గా వచ్చిన దిల్ రాజు కూడా మొహమాటానికైనా కొన్ని స్క్రీన్లు ఇస్తారంటూ బన్నీ వాసు వేసిన పంచులు ఆడియన్స్ ను బాగా నవ్వించాయి.

ఈ కామెంట్స్ కు దిల్ రాజు కూడా అంతే స్పోర్టివ్ గా కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ ఈ సినిమాను తనే రిలీజ్ చేసి ఉంటే, పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాను దించాడంటూ మళ్లీ తనపైనే ట్రోలింగ్ మొదలయ్యేదని నవ్వుతూ చెప్పారు. అందుకే ప్రొడ్యూసర్ గా కాకుండా జస్ట్ గెస్ట్ గా వచ్చి చాలా ప్రశాంతంగా ఉన్నానంటూ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో ఏ చిన్న ఇష్యూ వచ్చినా తన పేరే బయటకు వస్తుందనే సంగతి ఆయన మాటల్లో క్లియర్ గా కనిపించింది.

ఇండస్ట్రీలో దిల్ రాజు మీద ఎప్పుడూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. చిన్న సినిమాలకు థియేటర్లు సరిగ్గా దక్కనప్పుడు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్లు కొందరైతే.. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఎన్నో కొత్త సినిమాలు నిలబడ్డాయని చెప్పేవాళ్లూ ఉన్నారు. పైగా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ కూడా వచ్చేస్తుందనే టాక్ ట్రేడ్ లో ఉంది. ఏదేమైనా ఆయన పేరు చుట్టూ ఏదో ఒక హడావుడి నడుస్తూనే ఉంటుంది. అదే విషయాన్ని బన్నీ వాసు హైలెట్ చేశారు.

ఇప్పుడున్న కాంపిటీషన్ లో చిన్న సినిమాలు నిలబడాలంటే కేవలం కంటెంట్ ఉంటే సరిపోదు. గ్రౌండ్ లెవెల్ లో స్క్రీన్లు దక్కించుకోవడానికి మేకర్స్ రకరకాల ప్లాన్స్ వేయాల్సి వస్తోంది. పెద్ద డిస్ట్రిబ్యూటర్లను, బడా ప్రొడ్యూసర్లను ఈవెంట్స్ కు పిలిచి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. దీన్ని మేకర్స్ తీసుకుంటున్న ఒక ప్రాక్టికల్ మార్కెటింగ్ స్ట్రాటజీగా కూడా కొందరు చూస్తున్నారు.

బన్నీ వాసు సరదాగా వేసిన జోకులు మాత్రమేనా లేక ఇండస్ట్రీలో నిజంగానే ఇలాంటి ఈక్వేషన్స్ నడుస్తున్నాయా అనేది పక్కనపెడితే.. ఈ ఈవెంట్ తో సినిమాకు మంచి బజ్ అయితే వచ్చింది. దిల్ రాజు లాంటి పెద్దల సపోర్ట్ ఉండటం ప్రాజెక్ట్ కు అదనపు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మరి ఈ థియేటర్ల ప్లానింగ్ బాక్సాఫీస్ దగ్గర క్రేజీ కళ్యాణం టీమ్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.