బ్రదర్ అంటూ బన్నీ వాసు పంచులు ఎవరికి..?
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, నిహారిక లీడ్ రోల్ లో నటించిన సినిమా మిత్ర మండలి.
By: Ramesh Boddu | 14 Oct 2025 9:47 AM ISTప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, నిహారిక లీడ్ రోల్ లో నటించిన సినిమా మిత్ర మండలి. విజయేందర్ ఎస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, విజయేందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు బన్నీ వాసు సమర్పకుడిగా ఉన్నారు. అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేటెస్ట్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో బన్నీ వాసు కామెంట్స్ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేశాయి.
నాలుగు సినిమాలు బాగా ఆడాలి.. ఫేస్ బాల్ మాకే కాబట్టి..
ఈ సినిమా ట్రైలర్ కింద నెగిటివ్ కామెంట్స్ పై స్పందించారు బన్నీ వాసు. బ్రదర్ అంటూ ఆ నెగిటివ్ కామెంట్స్ చేయిస్తున్న వారి మీద పంచులు విసిరాడు. ఈ సినిమాలో ఎక్కడ నవ్వాలో చెప్పండంటూ కామెంట్ పెట్టారు. ముందు రండి సినిమా చూడండి.. అప్పుడు మీకే అర్ధమవుతుంది. రిలీజ్ అవుతున్న నాలుగు సినిమాలు బాగా ఆడాలి.. ఫేస్ బాల్ మాకే కాబట్టి మేము సిక్స్ కొట్టాలి.
అందరు ఎదగాలి అందరితో పాటే మేము ఎదాలి.. నెగిటివ్ ట్రోల్ చేస్తే ఎదుగుదల ఆగిపోతుంది అనుకుంటే అది మీ కర్మ అన్నట్టే అని అన్నారు బన్నీ వాసు. ఆడియన్స్ జడ్జిమెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఐతే కావాలని నెగిటివ్ ట్రోల్స్ చేసే చిన్న పిల్లల ఆటలు వద్దని అన్నారు బన్నీ వాసు. బ్రదర్ కష్టపడాం ఎదుగుదాం పైన దేవుడు ఉన్నాడు.. సినిమాను చూసే ప్రేక్షకుడు ఉన్నాడని అన్నారు బన్నీ వాసు. యుద్ధం చేయడం తప్పు కాదు కానీ దాన్ని ధర్మంగా చేయాలి.. నేనైతే అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటా.. బాగాలేకపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటా.. ఇలాంటి ట్రోల్స్ వల్ల నా వెంట్రుక కూడా పీకలేరని అన్నారు బన్నీ వాసు.
మీరెంత ట్రోల్ చేసినా నా పరుగు ఆగదు..
నేను ఇక్కడితే ఆగిపోనూ పరుగెడుతూనే ఉంటా.. పరుగెడుతుండటంలో విజయం ఉంది. మీరెంత ట్రోల్ చేసినా నా పరుగు ఆగదు. ఐతే ట్రోల్స్ చేసే వారికి కూడా బన్నీ వాసు సలహాలు ఇచ్చాడు. కొంచం డబ్బులు ఎక్కువ తీసుకోండి.. పొగడటానికి తక్కువ తీసుకోండి.. తిట్టడానికి ఎక్కువ తీసుకోండని అన్నాడు బన్నీ వాసు. ఈ దీపావళికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఐతే మిత్రమండలి మీద ఎక్కువ నెగిటివ్ ట్రోల్స్ చేయిస్తున్నట్టుగా బన్నీ వాసు దృష్టికి వచ్చింది. అందుకే ఆయన ఈవెంట్ లో బ్రదర్ అంటూ పంచులు వేశారు.
బన్నీ వాసు ఇంత వైల్డ్ గా మాట్లాడింది ఎప్పుడు చూడలేదు. ఇలా సినిమా మీద నెగిటివిటీ చేస్తుంది ఎవరో తెలిసి డైరెక్ట్ గా అతన్ని ఉద్దేశించి మాట్లాడినట్టు ఉంది. ఇంతకీ బన్నీ వాసు ఇంతగా ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటి.. దాని వెనక ఉన్న వ్యక్తులు ఎవరన్నది ఇప్పుడు వాడి వేడి చర్చ జరుగుతుంది.
