Begin typing your search above and press return to search.

కార్మికుల సమ్మెపై బన్నీ వాస్ రియాక్షన్.. ఏమన్నారంటే?

టాలీవుడ్ లో సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. 30 శాతం వేతనాలు పెంచాలని పట్టుబట్టి ఫిల్మ్ ఫెడరేషన్‌ బంద్ కు పిలుపునిచ్చింది.

By:  M Prashanth   |   7 Aug 2025 3:58 PM IST
కార్మికుల సమ్మెపై బన్నీ వాస్ రియాక్షన్.. ఏమన్నారంటే?
X

టాలీవుడ్ లో సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. 30 శాతం వేతనాలు పెంచాలని పట్టుబట్టి ఫిల్మ్ ఫెడరేషన్‌ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో కార్మికులు షూటింగ్స్ కు వెళ్లడం లేదు. కానీ నిర్మాతలంతా వెనక్కి తగ్గడం లేదు. తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రతిభ కలిగిన వారిని దరఖాస్తులు చేసుకోమంది. దీంతో వివాదం కాస్త ముదిరింది. ఇప్పుడు ఆ విషయంపై నిర్మాత బన్నీ వాస్ రెస్పాండ్ అయ్యారు.

"షూటింగ్స్ ఆగిన పరిస్థితి ఉంది.. మీ సపోర్ట్ ఎవరికి? కార్మికులకా? ప్రొడ్యూసర్స్ కా?" అని బన్నీ వాస్ ను మీడియా ప్రశ్నించగా.. తాను న్యూట్రల్ అని తెలిపారు. "3 ఏళ్ల తర్వాత వేతనాలు పెంచాలి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ బాగా ఎక్కువగా అడుగుతున్నారు. నిర్మాతలు బ్యాలెన్స్ చేయమని అడుగుతున్నారు. పెంపునకు విరుద్ధం కాదు" అని తెలిపారు.

"కానీ ఇప్పుడు 30 శాతం పెంచాలి అంటున్నారు. అది మూడేళ్ల తర్వాత 50 శాతానికి పెరుగుతుంది. అప్పుడు మళ్లీ పెంచాలి. అందుకే లాజిక్ మిస్ అవుతుందనేది ప్రొడ్యూసర్ క్వశ్చన్" అని చెప్పారు. అదే సమయంలో స్కిల్స్ విషయంలో ఇటీవల కొందరు నిర్మాతలు చేసిన వ్యాఖ్యలను కూడా బన్నీ వాస్ దగ్గర ప్రస్తావించారు.

మన దగ్గర స్కిల్స్ లేవా, సీనియర్ ప్రొడ్యూసర్ గా చెప్పండని అడిగారు. "తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్లింది. ఎన్ని సినిమాలు ఆ రేంజ్ కు వెళ్లాయో చూడాలి. కేవలం 10-12 చిత్రాలు ఉంటాయి. ఆ మూవీస్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలతో లెక్కలు వేయకూడదు" అని బన్నీ వాస్ తెలిపారు.

"ఆ 10 సినిమాలతో ఇండస్ట్రీ ప్రాఫిట్స్ లెక్కవేయకూడదు. అది తప్పు. ఆ పది చిత్రాల టైమ్ లో రెండు మూడందల చిన్న సినిమాలు వచ్చాయి. ఆ పదితోనే ఎదిగిపోయామని అనుకోకూడదు. రెవెన్యూస్ పెరిగిపోయానడం తప్పు. అది ఆ చిత్రాల వరకే. ఒక చిన్న సినిమా చేస్తే రూ.10-12 కోట్లు అవుతుంది. అన్నీ రేట్లు పెరిగాయి" అని చెప్పారు.

"చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తీస్తే ఏం మిగలడం లేదు. ఎక్స్ ట్రా ఆర్డనరీ సినిమాలు వస్తేనే లాభాలు వస్తాయి. బాగానే ఉందన్నా జనాలు థియేటర్స్ కు రావడం లేదు. ఒక నిర్మాత ఎక్స్ ట్రా ఆర్డనరీ సినిమాలు ఎన్ని తీయగలడు? హైదరాబాద్ లోని ఓ ఇంటిలో షూట్ చేయాలంటే రోజుకు రూ.60-70 వేల రెంట్" అని తెలిపారు.

మన దగ్గర ఉన్న వారి స్కిల్స్ అప్డేట్ చేయాలా వద్దా అంటే.. తెలుగు టెక్నీషియన్స్ 100% అప్డేట్ చేసుకోవాలని బన్నీ వాస్ తెలిపారు. "తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్లాయంటే.. అక్కడి టెక్నీషియన్స్ అవసరం. మన వాళ్లతో ఆ స్థాయిని మ్యాచ్ చేయలేం. వాళ్లను తీసుకురావాలంటే చాలా బర్డన్ అవుతుంది" అని చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.