Begin typing your search above and press return to search.

తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ ముంబైకి మకాం మార్చాడా..?

గీతా ఆర్ట్స్ లో జరిగే ప్రతి సినిమా బన్నీ వాసు ప్రమేయంతోనే జరుగుతుంది. ఐతే ఈమధ్య బన్నీ వాసు గీతా ఆర్ట్స్ కి దూరమయ్యాడు అన్న కామెంట్స్ బలంగా వినిపించాయి.

By:  Ramesh Boddu   |   10 Oct 2025 9:58 AM IST
తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ ముంబైకి మకాం మార్చాడా..?
X

స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు కొత్తగా బన్నీ వాసు వర్క్స్ అనే బ్యానర్ మొదలు పెట్టాడు. అసలైతే బన్నీ వాసు గీతా ఆర్ట్స్ లో ఒక భాగంగా ఇన్నాళ్లు పనిచేస్తూ వచ్చారు. గీతా ఆర్ట్స్ సినిమాలను ప్రమోట్ చేస్తూ నిర్మాతగా ఆయన కూడా ఎదుగుతూ వచ్చారు. నిర్మాత అన్నది పక్కన పెడితే బన్నీ వాసు అల్లు అర్జున్ చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆర్య సినిమా నుంచి ఈ బాండింగ్ కొనసాగుతూ వచ్చింది. అందుకే అల్లు అర్జున్ ప్రతి సినిమాకు బన్నీ వాసు ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నడు. ఆ సినిమాకు సంబంధించిన పనుల్లో కూడా బన్నీ వాసు బిజీగా ఉన్నాడు.

బన్నీ వాసు ఈమధ్య ఎక్కువగా ముంబైలో..

జవాన్ సినిమా తర్వాత అట్లీ చేస్తున్న ఈ మూవీపై హ్యూజ్ బజ్ ఉంది. అనౌన్స్ మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా పనుల కోసమే బన్నీ వాసు ఈమధ్య ఎక్కువగా ముంబైలో ఉంటున్నారట. రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్పారు. ముంబైలో అల్లు అర్జున్, అట్లీ సినిమా పనుల కోసమే అక్కడ స్పెండ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

గీతా ఆర్ట్స్ లో జరిగే ప్రతి సినిమా బన్నీ వాసు ప్రమేయంతోనే జరుగుతుంది. ఐతే ఈమధ్య బన్నీ వాసు గీతా ఆర్ట్స్ కి దూరమయ్యాడు అన్న కామెంట్స్ బలంగా వినిపించాయి. కానీ అలాంటి వాటికి బన్నీ వాసు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చాడు. ప్రస్తుతం బన్నీ వాసు మిత్ర మండలి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో తన ముంబై టు హైదరాబాద్ షిఫ్టింగ్ గురించి చెప్పారు.

అల్లు అర్జున్ డేట్స్ నుంచి సినిమా ప్రమోషన్స్..

అల్లు అర్జున్ చేసే సినిమా విషయంలో బన్నీ వాసు ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది. అల్లు అర్జున్ డేట్స్ నుంచి సినిమా ప్రమోషన్స్ ఇంకా మిగతా విషయాలన్నీ కూడా బన్నీ వాసు దగ్గర ఉండి చూసుకుంటాడు. అల్లు అర్జున్ ఏదైనా కథ ఓకే చేయాలన్నా సరే బన్నీ వాసు కూడ స్టోరీ డిస్కషన్స్ లో ఉంటాడని టాక్. సో బన్నీ వాసు అల్లు అర్జున్ కి మంచి సపోర్టింగ్ టీం గా మారాడు.

బన్నీ వాసు గీతా ఆర్ట్స్ నుంచి బయటకు రావాలన్న ఆలోచన లేదు కానీ బన్నీ వాసు బ్యానర్ లో కొత్త ప్రయోగాలు చేయాలన్న ఆలోచన ఉందని తెలుస్తుంది. తన బ్యానర్ ని డెవలప్ చేసే విషయంలో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇంకా డిసైడ్ అయినట్టు లేరు కానీ బన్నీ వాసు తన సొంత బ్యానర్ ని ఒక కొత్త సెన్సేషన్ గా మార్చాలనన్న థాట్ ఉన్నట్టు అనిపిస్తుంది.