Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ తిట్లకు బన్నీ వాస్ పారిపోతున్నారా?

టాలీవుడ్‌ లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు నిర్మాత బన్నీ వాస్. ఇటీవల జరిగిన టాలెంటెడ్ హీరో అడివి శేష్ డెకాయిట్ మూవీ ఈవెంట్‌ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

By:  M Prashanth   |   12 April 2026 10:12 PM IST
అల్లు అరవింద్ తిట్లకు బన్నీ వాస్ పారిపోతున్నారా?
X

టాలీవుడ్‌ లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు నిర్మాత బన్నీ వాస్. ఇటీవల జరిగిన టాలెంటెడ్ హీరో అడివి శేష్ డెకాయిట్ మూవీ ఈవెంట్‌ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ముఖ్యంగా టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి చెప్పిన మాటలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

ఆ కార్యక్రమంలో మాట్లాడిన బన్నీ వాస్, 'ఈ మధ్య ఎవరైనా పిలిచినా ఫంక్షన్లకు వెళ్లడం లేదు. అల్లు అరవింద్ గారు తిట్టిన తిట్లకు దూరంగా పారిపోతున్నా. ఇకపై ఈవెంట్స్‌ కు రానని కూడా చెప్పేశా. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం నా జీవితంలో తొలిసారి నేనే కాల్ చేసి ఫంక్షన్ ఎప్పుడు అని అడిగి వచ్చాను' అని అన్నారు. తనకు సినిమా నచ్చిందని, అందుకే కొంతమేరకు అయినా సపోర్ట్ చేయాలని భావించానని తెలిపారు.

అలాగే, తాను ఒక ఐదారు రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్‌ కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, ఆ ఈవెంట్‌ ను మిస్ అవ్వకూడదనుకుని ఉదయం 7.30 గంటలకే హీరో అడివి శేష్ కు కాల్ చేశానని చెప్పారు. 'లేస్తారో లేదో తెలియకపోయినా కాల్ చేశా. నేను డెకాయిట్ సినిమా చూశాను. టికెట్ డబ్బులకు న్యాయం చేసిన సినిమా ఇది' అంటూ ప్రశంసించారు బన్నీ వాస్.

ఇదిలా ఉండగా, బన్నీ వాస్ కెరీర్‌ లో అల్లు అరవింద్ పాత్ర ఎంతో కీలకమని తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత GA2 పిక్చర్స్ ద్వారా ఆయన నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.

అయితే ఇటీవల జరిగిన మరో మూవీ ఈవెంట్‌ లో బన్నీ వాస్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మిత్ర మండలి సినిమా కార్యక్రమంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ పై అల్లు అరవింద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా వాస్ కూడా అంగీకరించారు. 'ఆయన తిట్టిన తిట్లు మా నాన్న కూడా తిట్టలేదు' అని చెప్పారు.

ఇలాంటి పరిణామాల మధ్య కూడా బన్నీ వాస్, అల్లు అరవింద్‌ పై తన గౌరవం మాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. 'అల్లు అరవింద్ గారిని ఎప్పటికీ వదిలి వెళ్లను. ఆయన లేకపోతే నేను లేను' అని పలుమార్లు పేర్కొన్నారు. అలాగే అల్లు అర్జున్ తో తన స్నేహం కూడా తన ప్రయాణంలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పారు. చిన్న వయసులోనే, అంటే 19 ఏళ్లకే గీతా ఆర్ట్స్‌ లో చేరిన బన్నీ వాస్, క్రమంగా సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టి ఎదిగారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్‌ లో సక్సెస్‌ ఫుల్ నిర్మాతలలో ఒకరిగా నిలిచారు.