ఇండస్ట్రీ ఇష్యూస్ కు గీతా ఆర్ట్స్ అందుకే దూరమా?
ఈ రెండు ఇష్యూల్లో గీతా ఆర్ట్స్ పొదుపుగా, దూరంగా ఉందని.. ఇప్పుడు కూడా ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
By: M Prashanth | 7 Aug 2025 4:01 PM IST2025లో సినీ ఇండస్ట్రీలో రెండు ఇష్యూస్ నడిచిన విషయం తెలిసిందే. ఒకటి థియేటర్స్ లో పర్సంటేజీ విధానంపై అయితే.. మరొకటి 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికుల సమ్మె. పర్సంటేజ్ సిస్టమ్ లో సినిమాలు రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్స్ అంటే.. అలా చేస్తే తమకు తీరని నష్టం వస్తుందని నిర్మాతలు అప్పుడు తేల్చారు.
ఆ విషయంపై అప్పట్లో చాలా సంఘటనలు జరిగాయి. థియేటర్స్ బంద్ అంటూ ప్రకటన వచ్చింది. దాని వెనుక ఆ నలుగురు ఉన్నారని ప్రచారం జరిగింది. ఓ కమిటీ కూడా ఏర్పడింది. ఇప్పుడు కార్మికుల సమ్మె చేస్తుండగా.. నిర్మాతలు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. కార్మికులు 30 శాతం వేతనాలు పెంచేందుకు ఓకే చెప్పడం లేదు.
ఈ రెండు ఇష్యూల్లో గీతా ఆర్ట్స్ పొదుపుగా, దూరంగా ఉందని.. ఇప్పుడు కూడా ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ విషయంపై గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను లీడ్ చేస్తున్న బన్నీ వాస్ కు ప్రశ్న ఎదురైంది. లిటిల్ హార్ట్స్ మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించగా.. బన్నీ వాస్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చారు.
ఇండస్ట్రీ ఇష్యూల్లో గీతా ఆర్ట్స్ దూరంగా ఎందుకు ఉందని, అడిగితే న్యూట్రల్ అంటున్నారని అడగ్గా.. బన్నీ వాస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అని తెలిపారు. అయితే అనుభవం సమస్యలకు హెల్ప్ అవ్వాలి కదా అని అనగా.. సమస్యలు పరిష్కరించేందుకు కొన్ని టీమ్స్ పనిచేస్తున్నాయని చెప్పారు. డౌట్స్ ఉంటే తమకు కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.
అందుకే లీడ్ చేస్తున్నవారిని డిస్టర్బ్ చేయాలనుకోలేదని తెలిపారు. "అయితే పర్సంటేజ్ విధానంపై మొన్న ఓ కమిటీ వేశారు.. అందులో ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నారు. కానీ మీకు అడిగితే తెలియదు అన్నా.. కమ్యూనికేషన్ గ్యాప్.. మేం కనుక్కుంటే వాళ్లు ఇన్వాల్వ్ అవ్వడం లేదని అంటున్నారు" అని ప్రస్తావించారు.
"లీడ్ చేస్తున్నవాళ్లను చేయనివ్వండి. ఏమైనా ఉంటే మాతో మాట్లాడుతున్నారు. మొన్న మీటింగ్ కు అల్లు అరవింద్ గారు వెళ్లారు. నిన్న అందరూ వస్తే కలిశారు. తన వాల్యబుల్ సమాధానాలిచ్చారు. ఫోన్ చేసినా చెబుతున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది సజెన్స్ వరకు బాగుంటుంది. లీడ్ చేస్తున్న వాళ్ళు చేయని.. " అని బన్నీ వాస్ అన్నారు.
