Begin typing your search above and press return to search.

బ‌న్నీ..మ‌హేష్ ల‌లో ఎవ‌రు సేవియ‌ర్!

బ‌న్నీ- మ‌హేష్ న‌టిస్తోన్న చిత్రాలు పాన్ వ‌ర‌ల్డ్ లో రిలీజ్ రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ క‌థాన‌య‌కుడిగా అట్లీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న 22వ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది.

By:  Srikanth Kontham   |   4 March 2026 6:00 PM IST
బ‌న్నీ..మ‌హేష్ ల‌లో ఎవ‌రు సేవియ‌ర్!
X

బ‌న్నీ- మ‌హేష్ న‌టిస్తోన్న చిత్రాలు పాన్ వ‌ర‌ల్డ్ లో రిలీజ్ రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ క‌థాన‌య‌కుడిగా అట్లీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న 22వ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. కానీ ఏ తేదీన రిలీజ్ అవుతుంది అన్న‌ది ప్ర‌త్యేకంగా ప్ర‌క‌టించ‌లేదు. కానీ మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెరెక్కుతోన్న 'వార‌ణాసి' మాత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుంది. అధికారికంగా ప్ర‌క‌టించిన తేదీ ఇది. మొత్తం 120 దేశాల్లో వార‌ణాసి రిలీజ్ అవుతుంది. ఓ భారతీయ చిత్రం ఇన్ని దేశాల్లో రిలీజ్ అవ్వ‌డం అన్న‌ది ఇదే తొలిసారి.

ఇంత వ‌ర‌కూ ఏ ఇండియ‌న్ సినిమా గ్లోబ‌ల్ స్థాయిలో ఈ రేంజ్ లో రిలీజ్ అవ్వ‌లేదు. ఈ ర‌కంగా 'వార‌ణాసి' ఓ రికార్డు సృష్టించింది. ఈసినిమాకు ధీటుగా బ‌న్నీ 22వ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు అట్లీ ప్లాన్ చేస్తున్నాడు. తాను ఎంచుకున్న క‌థాంశం యూనిక్ గా ఉండ‌టంతో? గ్లోబ‌ల్ స్థాయిలో చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇక్క‌డ సేవియ‌ర్ మ‌హేష్ అవుతాడా? బ‌న్నీ అవుతాడా? అన్న‌ది కూడా అంతే ఆస‌క్తిక‌రం. మ‌హేష్ సినిమానే ముందుగా రిలీజ్ అయితే అత‌డే బ‌న్నీకి సేవియ‌ర్ గా నిలుస్తాడు. ఎందుకంటే 120 దేశాల్లో 'వార‌ణాసి' రిలీజ్ అనంత‌రం ఫ‌లితాల్లో ఏమాత్రం తేడాలు జ‌రిగినా బ‌న్నీ -అట్లీ అలెర్ట్ అవ్వ‌డానికి అవ‌కాశం చేతుల్లో ఉంటుంది.

'వార‌ణాసి' రిలీజ్ విష‌యంలో జ‌రిగిన త‌ప్పిదాల‌ను బ‌న్నీ సినిమా చేయ‌కుండా ముందే జాగ్ర‌త్త ప‌డే అవ‌కాశం చేతిలో ఉంటుంది. ప్రోడ‌క్ట్ చేతుల్లో ఉన్నంత సేపు ఎలాంటి జాగ్ర‌త్త‌లైనా తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. క‌లెక్ష‌న్స్ త‌క్కువ‌గా ఉన్న చోట రిలీజ్ అపోచ్చు. అలా కాకుండా ఒక్క‌సారి చేతులు దాటిందంటే? చేసేదేమీ ఉండ‌దు. జ‌రిగేది చూస్తూ ఉండ‌ట‌మే. ఎందుకంటే పాన్ వ‌ర‌ల్డ్ రిలీజ్ అన్నది టాలీవుడ్ కు ఇదే కొత్త అనుభ‌వం. గ‌తంలో తెలుగు సినిమాలు విదేశాల్లో రిలీజ్ అయినా చాలా లిమిటెడ్ గా రిలీజ్ అన్న‌ది జ‌రిగింది.

100 దేశాల్లో ఏ సినిమా రిలీజ్ అవ్వ‌లేదు. అదే బ‌న్నీ సినిమా `వార‌ణాసి` కంటే ముందే రిలీజ్ అయితే మ‌హేష్ కు సేవియ‌ర్ గా బ‌న్నీ అవుతాడు. రాజ‌మౌళి బ‌న్నీ సినిమా త‌ప్పిదాలు చెక్ చేసుకుని 'వార‌ణాసి'ని వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తారు. అలా చూసుకుంటే రాజ‌మౌళి ముందే కూసిన‌ట్లు అయింది. వార‌ణాసి రిజ‌ల్ట్ చూసుకుని బ‌న్నీ సినిమా రిలీజ్ చేయోచ్చు. ఇప్పుడా అవ‌కాశం బ‌న్నీ చేతుల్లో ఉంది. కానీ `వార‌ణాసి` కంటే ముందుగా బ‌న్నీ రిలీజ్ అనుకుంటే? గ‌నుక అది మ‌హేష్ కి ల‌క్కీగా క‌లిసొస్తుంది. కానీ ప్ర‌స్తుతానికి సేఫ్ జోన్ బ‌న్నీ ఉన్నాడు.