వాళ్లిద్దరి హీరోలు ఎవరన్నది ఆసక్తికరం!
దీంతో వశిష్ఠ తదుపరి అడుగు ఎటువైపు వేయబోతున్నారనేది ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వశిష్ఠ విజన్‌తో స్టార్ హీరోలను మెప్పించడంలో దిట్ట.
By: Srikanth Kontham | 1 May 2026 4:00 PM ISTప్రస్తుతం టాలీవుడ్‌లో యువ దర్శకుల హవా నడుస్తోంది. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బుచ్చిబాబు సానా -వశిష్ఠలు క్రేజీ ప్రాజెజక్ట్ లతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల హీరోల విషయంలో దర్శకులిద్దరు మంతనాలు జరుపుతున్నారు. దీంతో ఇద్దరు మెగా డైరెక్టర్లు ఏ స్టార్ హీరోలతో పని చేయబోతున్నారనే చర్చ అత్యంత ఆసక్తికరంగా మారింది.
`ఉప్పెన` వంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న బుచ్చిబాబు సానా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తన రెండవ చిత్రం పెద్దిని పూర్తి చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది. చరణ్‌ను మునుపెన్నడూ చూడని విధంగా బుచ్చిబాబు చూపించబోతున్నాడు. జూన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు `బింబిసార`తో సోషియో-ఫాంటసీ జానర్‌లో అద్భుతం సృష్టించిన వశిష్ఠ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `విశ్వంభర`ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
దీంతో వశిష్ఠ తదుపరి అడుగు ఎటువైపు వేయబోతున్నారనేది ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వశిష్ఠ విజన్‌తో స్టార్ హీరోలను మెప్పించడంలో దిట్ట. చిరంజీవి వంటి లెజెండరీ హీరోతో పని చేసిన అనుభవంతో నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా హీరోతో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఓ అగ్ర హీరోకి లైన్ వినిపించారని సమాచారం. దీంతో నయా దర్శకుల తదుపరి హీరోలపై ఆసక్తి నెలకోంది. ఇద్దరు దర్శకుల ప్రత్యేకత ఏమిటంటే? వారి సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాక కథలోని ఆత్మ బలంగా నమ్మి ముందుకెళ్తారు.
బుచ్చిబాబు సంభాషణలు - ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇస్తే, వశిష్ఠ విజువల్ గ్రాండీయర్ , గ్రాఫిక్స్‌తో మాయ చేస్తారు. తదుపరి చిత్రాలు ఏ హీరోలతో ఉన్నా? అవి ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే స్థాయిలో ఉంటాయని అభిమానులు నమ్ముతారు. ప్రస్తుతానికి ఇద్దరు దర్శకులు షూట్ పూర్తి చేసిన సినిమాలతో పాటు ఖాళీ సమయంలో కొత్త స్క్రిప్ట్ వర్క్‌ను పక్కాగా పూర్తి చేసుకునే పనిలో పడ్డారు. ఓసారి ఆ హీరోలు ఎవరు? అయ్యే అవకాశం ఉందంటే? బుచ్చిబాబు తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోలతో చేసే అవకాశం ఉంది.
`ఉప్పెన` సమయంలోనే ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేశారని గతంలో వార్తలు వచ్చాయి. అలాగే వశిష్ఠ కూడా `బింబిసార 2` వైపు వెళ్తారా లేక సరికొత్త ఫాంటసీ కథతో రామ్ చరణ్ ని కలుస్తారా అనేది చూడాలి. ఇద్దరు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ దర్శకులుగా మారడంతో స్టార్ హీరోలు కూడా వీరితో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
