Begin typing your search above and press return to search.

పెద్ది మూవీ నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హైయెస్ట్ ఎవరికంటే?

ఇకపోతే ఈ సినిమాలో భారీ తారాగణం భాగమైన విషయం అందరికీ తెలిసిందే.

By:  Madhu Reddy   |   20 May 2026 10:56 AM IST
పెద్ది మూవీ నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హైయెస్ట్ ఎవరికంటే?
X

కోటి ఆశలతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవాలని రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. ఉప్పెన సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అలా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేయగా.. ట్రైలర్ కూడా మంచి అంచనాలు పెంచేసింది.

ఇకపోతే ఈ సినిమాలో భారీ తారాగణం భాగమైన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమాలో వివిధ పాత్రల కోసం ఎవరు? ఎంత రెమ్యూనరేషన్? తీసుకుంటున్నారు అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హీరోగా లీడ్ రోల్ పోషిస్తున్న రామ్ చరణ్.. ఈ సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్', కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గేమ్ ఛేంజర్' చిత్రాల కంటే కూడా ఇది భారీ మొత్తం అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలలో రామ్ చరణ్ కూడా చేరిపోయారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె ఏకంగా రూ.6కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ రూ .7కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా.. కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ రూ.10 కోట్లు తీసుకుంటున్నారు. ఇక ప్రముఖ నటుడు కం విలన్ కం హీరో జగపతిబాబు రూ.5కోట్లు తీసుకుంటుండగా.. బోమన్ ఇరానీ రూ.3 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ , మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబు ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయం కూడా చర్చకు వచ్చింది. వాస్తవానికి ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా బడ్జెట్ రూ.22 కోట్లు.. కానీ వచ్చింది మాత్రం రూ.100 కోట్లకు పైగానే.. అయితే ఈ సినిమా కోసం రూ.25 లక్షలు తీసుకున్న బుచ్చిబాబు సనా.. ఏకంగా తన రెండవ సినిమా కోసం రూ.30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన రెండవ సినిమాతోనే ఒక స్టార్ హీరో స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.