ఒక్క సీన్‌తో గెలుపు? చరణ్ నటనపై బుచ్చిబాబు బిగ్ స్టేట్‌మెంట్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది.
By: Madhu Reddy | 9 Jun 2026 8:00 AM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఒకవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు ఇప్పటివరకూ రూ. 250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా సక్సెస్ మీట్ తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు.. సినిమాలో రామ్ చరణ్ చేసిన ఒక పర్టిక్యులర్ సీన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం..
థియేటర్లలో ఏడిపించేస్తున్న చరణ్:
'పెద్ది బాక్సాఫిస్ ఛాంపియన్ థ్యాంక్యూ మీట్'లో బుచ్చిబాబు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. "నేనే థియేటర్‌లో చూసాను, ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ సినిమాను ఆస్వాదిస్తున్నారు.ముఖ్యంగా సినిమాలో వచ్చే ఒక హాస్పిటల్ సీన్ చూసి థియేటర్‌లోని ప్రేక్షకులంతా భావోద్వేగానికి లోనవుతున్నారు" అని బుచ్చిబాబు చెప్పారు. ఇక రామ్ చరణ్ తన నటనతో థియేటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ల వెంట నీళ్లు తెప్పించారని ఆయన కొనియాడారు.
చరణ్‌కు నేషనల్ అవార్డ్ గ్యారెంటీ:
నిన్న ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లలో రామ్ చరణ్ తో కలిసి బుచ్చిబాబు స్వయంగా సినిమా వీక్షించారు. ఆ సమయంలో జరిగిన ఒక క్రేజీ అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. "హాస్పిటల్ సీన్ రాగానే థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులంతా సీట్లలోంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. చరణ్ నటనకు ఫిదా అయిపోయి.. ఇక ఈ యాక్టింగ్‌కు ఆయనకు 'నేషనల్ అవార్డ్ గ్యారెంటీ' అని గట్టిగా అరిచారు" అంటూ బుచ్చిబాబు ఆనందం వ్యక్తం చేశారు.
బుచ్చిబాబు కల నెరవేరింది:
ఒక దర్శకుడిగా తాను ఏ ఆశయంతో, దేనికోసం అయితే ఈ సినిమా కథను రాసుకున్నానో.. అది ఈరోజు పూర్తిగా నెరవేరిందని బుచ్చిబాబు అన్నారు. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ నటుడు తన కథను నమ్మి, ప్రాణం పెట్టి నటించడం వల్లే ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ సాధ్యమైందని చెప్పారు. ఇక చరణ్ పడిన కష్టానికి, చూపించిన వేరియేషన్స్‌కు ఈ సినిమా వసూళ్లు, ప్రేక్షకుల చప్పట్లే నిదర్శనమని చిత్ర యూనిట్ సంబరపడిపోతోంది.
'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబుగా నేషనల్ అవార్డు లెవెల్ నటనను చూపించిన రామ్ చరణ్.. ఇప్పుడు 'పెద్ది' చిత్రంతో మరోసారి తన యాక్టింగ్ పవర్ ఏంటో నిరూపించుకున్నారు. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీని కదిలించే ఎమోషన్స్ కూడా ఉండటంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో ఇంకా రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరి బుచ్చిబాబు అన్నట్టు ఈ హాస్పిటల్ సీన్‌కు రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వరిస్తుందో లేదో చూడాలి.
