Begin typing your search above and press return to search.

సుకుమార్ కి శిష్యుడు ఇచ్చే గొప్ప బ‌హుమ‌తి!

సుకుమార్ ప్రియ‌శిష్యుడు ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చేది బుచ్చిబు సాన‌. ఇద్ద‌రి సాన్న‌హిత్యం ఈనాటిది కాదు.

By:  Srikanth Kontham   |   5 Sept 2025 12:07 PM IST
సుకుమార్ కి శిష్యుడు ఇచ్చే గొప్ప బ‌హుమ‌తి!
X

సుకుమార్ ప్రియ‌శిష్యుడు ఎవ‌రంటే ఠ‌క్కున గుర్తొచ్చేది బుచ్చిబు సాన‌. ఇద్ద‌రి సాన్న‌హిత్యం ఈనాటిది కాదు. సుకుమార్ లెక్క‌లు మాష్టారుగా ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుంచి బుచ్చిబాబు శిష్యుడే. ప్ర‌తిభావంతుడు కావ‌డంతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ప్రియ‌శిష్యుడిగా మారాడు. సుకుమార్ కార‌ణంగానే బుచ్చి బాబు కూడా సినిమాల్లోకి వ‌చ్చాడు. తెలివైన వాడు కావ‌డంతో? బుచ్చిబాబును ప‌రిశ్ర‌మ‌లోనూ ప్రోత్స‌హిం చారు. ఇప్పుడు గురువుకు పోటీగానే శిష్యుడు సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాడు.

ఖ‌రీదైనా కార్లు..విల్లాలు కాదు:

ఇంత గొప్ప శిష్యుడు దొరికినందుకు సుకుమార్ కూడా ఎంతో గ‌ర్వంగా ఫీల‌వుతుంటారు. త‌న‌ని మించిన గొప్ప ద‌ర్శ‌కుడిగా ఎదుగుతాడ‌ని ప్ర‌శంసిస్తుంటారు. గురువు విష‌యంలో బుచ్చిబాబు కూడా అంతే గౌర‌వ మర్యాద‌ల‌తో మెలుగుతుంటాడు. ఎలాటి వేదిక‌పైనైనా గురువు గారు అంటూ ఎంతో ఆహ్లదంగా సంబోది స్తుంటారు. మ‌రి అలాంటి గురువుకు శిష్యుడు ఏమిచ్చి రుణం తీర్చుకోగ‌ల‌రు. ఖ‌రీదైన కార్లా? ఖ‌రీదైన విల్లాలా? ఏది కావాల‌న్నా గురువుకు ఇవ్వ‌గ‌ల స్థాయిలో శిష్యుడు ఉన్నాడు. గురువు కోరుకోవాలే గానీ శిష్యుడు ఇవ్వ‌న‌ది అంటూ ఉండ‌దు అన్నంత ఎత్తులో ఉన్నాడు.

ఆయ‌న లేక‌పోతే ఎక్క‌డో ఉండే వాడిని:

మ‌రి గురువు కోసం ప్రేమ‌గా శిష్యుడు ఇచ్చే బ‌హుమ‌తి ఏది? అంటే బుచ్చిబాబు తాను తీసే ప్ర‌తీ సినిమా లోనూ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పేరు ఎప్పుడూ ఉంటుంద‌ని..అదే త‌న గురువుకు తాను ఇచ్చే బ‌హు మ‌తిగా పేర్కొన్నాడు. త‌న క్లాస్ కి సుకుమార్ లెక్క‌లు మాష్టారు కాక‌పోయి ఉంటే? తాను సినిమాల్లోకి వ‌చ్చే వాడిని కాద‌ని...మ‌రో రంగంలో ఎక్క‌డో ఉండేవాడిన‌న్నారు. అలాగే బుచ్చిబాబు త‌న రోల్ మోడ‌ల్ గానూ గురువునే తీసుకున్నారు. నూనుగు మీసాల వ‌య‌సు నుంచే తాను సుకుమార్ సార్ తెలుస‌న్నారు.

ఎప్ప‌టికీ గురువు మెచ్చిన శిష్యుడిగానే:

నా స్నేహితులు కూడా నువ్వు సుకుమార్ లా ఆలోచిస్తావ్ అని అంటుంటారు. అలా సుక్కు సార్ కి బాగా క‌నెక్ట్ అవ్వ‌డంతో నే మా ప్ర‌యాణం ఇంత వ‌ర‌కూ వ‌చ్చింద‌న్నారు. సుకుమార్ సార్ న‌న్ను ఒరేయ్ అని పిలుస్తారు. ఎంతో క్లోజ్ అయితే త‌ప్ప ఆయ‌న అలా ఎవ‌ర్నీ పిల‌వ‌రు. అలా పిలిపించుకోవ‌డం త‌న అదృ ష్టంగా పేర్కొన్నాడు బుచ్చిబాబు. గురువును మించిన శిష్యుడిని కాదు..ఆయ‌న వ‌ద్ద ఎప్పుడు గురువు మె చ్చిన శిష్యుడిగానే ఉంటాన‌న్నారు. త‌ప్పు చేస్తే ఎవ‌రైనా తిడ‌తారు. కానీ ఆయ‌న తిట్టినా మ‌ళ్లీ ఫోన్ చేసి సారీ చెబుతారు. సారీ ఏమ‌నుకోకురా...ఏదో అనేశాను అంటారు. ఎదుటోడు ఎంత పెద్ద చేసినా క్ష‌మిం చ‌డంలో ముందుంటారు. అదే ఆయ‌న గొప్ప‌త‌నం` అని అన్నారు.