ఈ దేవుడి గుడిలో మొక్కితే చరణ్‌తో సినిమా ఖరారైనట్టే!
సాధారణంగా గ్లామర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకో, హీరోయిన్లకో ఉండే క్రేజ్ - ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనం నిరంతరం చూస్తూనే ఉంటాం.
By: Sivaji Kontham | 22 Jun 2026 9:49 AM ISTసాధారణంగా గ్లామర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకో, హీరోయిన్లకో ఉండే క్రేజ్ - ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. కానీ ఒక దర్శకుడికి కూడా హీరోల రేంజ్‌లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంటుందా..! అనిపించేలా... టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కు పిఠాపురంలో దక్కిన స్వాగతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన `పెద్ది` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ ఆనందంలో తన ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఆయన తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో అడుగుపెట్టగా.. అక్కడ వేలాదిగా తరలివచ్చిన అభిమానులు బుచ్చిబాబుకు ఒక భారీ గజమాల వేసి సత్కరించారు.
సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో అడుగుపెట్టిన బుచ్చిబాబు.. అక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకున్నారు. కలియుగంలో అధర్మాన్ని తొలగించి, మానవాళిని ఉద్ధరించడానికి దత్తాత్రేయుడు స్వయంగా శ్రీపాద వల్లభుల అవతార రూపంలో పిఠాపురం పుణ్యక్షేత్రంలో వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహిమాన్వితమైన శ్రీపాద వల్లభ అనఘా దత్తక్షేత్రంలో మొక్కితే ఆశించిన ఫలితం దక్కుతుందని భక్తుల బలమైన నమ్మకం. ఈ పవిత్ర క్షేత్రంలో బుచ్చిబాబు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇష్ట దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి సమక్షంలో తన రెండో సినిమా హీరో రామ్ చరణ్ అని రాసుకున్నాడట. అతడి మొక్కు చివరికి ఫలించింది. చరణ్ తో సినిమా తీసాడు. ఇక బుచ్చిబాబు ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ పూర్తయ్యాక.. పిఠాపురం పూర్ణ థియేటర్ కు వెళ్లి అభిమానులను పలకరించారు.....
బుచ్చిబాబు థియేటర్‌కు వస్తున్నారనే సమాచారంతో పిఠాపురం పరిసర ప్రాంతాల నుండి భారీగా జనాలు తరలివచ్చారు. ఒక దర్శకుడికి ఈ స్థాయి మాస్ ఫాలోయింగ్, పూలవర్షాలు కురవడం టాలీవుడ్‌లో చాలా అరుదుగా చూస్తాం. `ఉప్పెన` చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన బుచ్చిబాబు... ఇప్పుడు `పెద్ది` సినిమాతో దర్శకుడిగా వంద శాతం మెప్పించగలిగాడని.. ప్రేక్షకుల పల్స్ తెలిసిన అసలైన మేకర్ ఆయనేనని థియేటర్ వద్ద ఫ్యాన్స్ నినాదాలు చేశారు.
ఇక బాక్సాఫీస్ వసూళ్ల పరంగా `పెద్ది` సినిమా సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని తొలి 10 రోజులు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్లింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బుచ్చిబాబు స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కంటెంట్.. నటీనటుల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది.
ఈ ఏడాది (2026) విడుదలైన సౌత్ ఇండియన్ చిత్రాలలో `పెద్ది` బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచి కలెక్షన్ల పరంగా టాప్ స్థానాల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఒక సాధారణ కథను కూడా వెండితెరపై ఎంతో రిచ్‌గా, ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేయగల సత్తా తనకుందని బుచ్చిబాబు `పెద్ది` ఫలితంతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.
