పెద్ది అంటే ఇదే... బుచ్చిబాబు మెగా ఎలివేషన్స్
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ప్రమోషన్స్ అన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి.
By: M Prashanth | 31 May 2026 11:19 AM ISTరామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ప్రమోషన్స్ అన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా బజ్ పెంచడానికి లేటెస్ట్ గా చెన్నైలో ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేదికపై దర్శకుడు బుచ్చిబాబు సన మాట్లాడుతూ తన హీరో రామ్ చరణ్ గురించి ఎంతో ఎమోషనల్ గా కొన్ని ముచ్చట్లు పంచుకున్నాడు.
స్టేజ్ మీద మైక్ తీసుకున్న బుచ్చిబాబు తన ఆనందాన్ని, ఎమోషన్ ను మాటల్లో చెప్పలేకపోయాడు. రామ్ చరణ్ ను ఉద్దేశించి నేరుగా మాట్లాడుతూ.. "థాంక్యూ సార్, చరణ్ సార్.. పెద్ది అంటే ఓన్లీ చరణ్ సార్ మాత్రమే" అంటూ తన ఎగ్జైట్ మెంట్ ను ఏమాత్రం దాచుకోకుండా బయటపెట్టాడు. "చరణ్ సార్, చరణ్ సార్, చరణ్ సార్.. పెద్ది, పెద్ది, పెద్ది అంతే" అంటూ తన సినిమాపై, హీరోపై ఉన్న ప్రేమను ఆడియన్స్ ముందు చాలా నాచురల్ గా హైలెట్ చేశాడు. తనను అంతగా నమ్మినందుకు చరణ్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు.
ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్, తనలాంటి యువ దర్శకుడిని పూర్తిగా నమ్మి ఇంత భారీ బడ్జెట్ సినిమా చేయడం నిజంగా గొప్ప విషయం అని బుచ్చిబాబు ఫీలింగ్. తన విజన్ ను కరెక్ట్ గా అర్థం చేసుకుని, ఏమాత్రం సందేహించకుండా ఈ ప్రాజెక్ట్ ను తన చేతుల్లో పెట్టినందుకు దర్శకుడిగా ఆయన ఆ నమ్మకాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తన స్పీచ్ ద్వారా చెప్పకనే చెప్పాడు. అందుకే పదే పదే చరణ్ పేరు చెబుతూ, తనను ఇంతలా నమ్మినందుకు చాలా ఎమోషనల్ గా థాంక్స్ చెప్పుకున్నాడు.
పెద్ది అనే పవర్ ఫుల్ పాత్ర కోసం రామ్ చరణ్ ఎంతలా కష్టపడ్డాడో, ఆ క్యారెక్టర్ లోకి ఎలా పరకాయ ప్రవేశం చేశాడో బుచ్చిబాబు మాటల్లో స్పష్టంగా అర్థమవుతోంది. ఒక మారుమూల పల్లెటూరి కుస్తీ యోధుడిగా చరణ్ మేకోవర్, ఆయన సెట్స్ లో చూపించిన డెడికేషన్ చూసిన తర్వాత బుచ్చిబాబుకు ఆ పాత్రలో వేరే ఎవరూ ఊహకు కూడా రాలేదు. అందుకే పెద్ది క్యారెక్టర్ అంటే అది కేవలం రామ్ చరణ్ మాత్రమే అని ఫిక్స్ అయ్యాడు. ఆ రేంజ్ లో ఆయన తన హీరోతో కనెక్ట్ అయిపోయాడు.
బుచ్చిబాబు రాసుకున్న ఈ యూనిక్ విలేజ్ స్పోర్ట్స్ స్టోరీకి చరణ్ తోడవడంతో ప్రాజెక్ట్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దానికి తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాలు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటం, జాన్వీ కపూర్ లాంటి క్రేజీ హీరోయిన్ నటిస్తుండటంతో అంచనాలు మరో లెవెల్ కు వెళ్లాయి. ఈ ప్రయాణంలో చరణ్ ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా అవుట్ పుట్ ఇంత అద్భుతంగా వచ్చిందని, అందుకే డైరెక్టర్ తన సక్సెస్ క్రెడిట్ అంతా ఎలాంటి మొహమాటం లేకుండా రామ్ చరణ్ కే ఇచ్చేస్తున్నాడు.
ఇక చెన్నై ప్రెస్ మీట్ లో బుచ్చిబాబు చాలా చిన్న స్పీచ్ ఇచ్చినా, అందులో తన హీరోపై ఉన్న అభిమానం, నమ్మకం మాత్రం చాలా బలంగా కనిపించాయి. దర్శకుడు, హీరోల మధ్య ఉన్న ఈ అద్భుతమైన బాండింగ్ చూస్తుంటేనే సినిమా ఎంత బాగా వచ్చి ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగు నేటివిటీకి అద్దం పట్టే విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ 'పెద్ది' చిత్రం జూన్ 4న థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందో చూడాలని సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
