Begin typing your search above and press return to search.

పెద్ది తర్వాత బుచ్చిబాబు కొత్త ప్లాన్!

టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఆయన కథలపై చూపించే నిబద్ధత.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Jun 2026 10:00 PM IST
పెద్ది తర్వాత బుచ్చిబాబు కొత్త ప్లాన్!
X

టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తొచ్చేది ఆయన కథలపై చూపించే నిబద్ధత. ఒక సినిమా పూర్తైన వెంటనే మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే డైరెక్ట‌ర్ల కంటే, తన ఆలోచనలను పూర్తిగా మలచుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. రామ్ చ‌ర‌ణ్ తో చేసిన పెద్ది స‌క్సెస్ త‌ర్వాత బుచ్చిబాబు తన పని విధానంలోనే కీలకమైన మార్పుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉప్పెనతో డైరెక్ట‌ర్ గా అద్భుతమైన అరంగేట్రం చేసిన బుచ్చిబాబు, ఆ సినిమా తర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించలేదు. తన రెండో సినిమాకు కథను రెడీ చేసుకోవ‌డం, దానికి త‌గ్గ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ నిర్వహించడం కోసం ఆయన చాలా ఎక్కువ స‌మ‌యాన్నే కేటాయించారు. ఫలితంగా ఉప్పెన నుంచి పెద్ది వరకు ప్రేక్షకులు, పరిశ్రమ దాదాపు కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. కానీ ఆ నిరీక్షణకు తగిన ఫలితం లభించిందనే అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది. పెద్ది బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకోవడంతో పాటు డైరెక్ట‌ర్ గా బుచ్చిబాబు స్థాయిని మరింత పెంచింది. ముఖ్యంగా ఆయన కథ చెప్పే తీరు, ఎమోష‌న్స్ ను మలిచే విధానం, క్యారెక్ట‌ర్ల డిజైన్ పై ప్రశంసలు దక్కాయి. దీంతో ఆయన తదుపరి సినిమా పట్ల సహజంగానే ఆసక్తి పెరిగింది.

ఈ నేపథ్యంలో బుచ్చిబాబు గతంలా ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని భావించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ, అది లాంగ్ గ్యాప్ కాదని తెలుస్తోంది. త్వరలోనే కొత్త కథ డెవ‌ల‌ప్‌మెంట్ వ‌ర్క్స్ ను ప్రారంభించి తర్వాతి ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని బుచ్చిబాబు భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పోటీ తీవ్రంగా పెరిగింది. ఒక స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ తన క్రేజ్‌ను కొనసాగించాలంటే వరుసగా ప్రాజెక్టులను అనౌన్స్ చేయ‌డం కూడా కీలకంగా మారింది. ఈ అంశాన్ని బుచ్చిబాబు కూడా గుర్తించినట్లు కనిపిస్తోంది. అందుకే ఈసారి స్టోరీ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాసెస్‌ను వేగవంతం చేసి, గతంతో పోలిస్తే తక్కువ వ్యవధిలోనే తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇక బుచ్చిబాబు ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌పై ఇప్పటికే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో కాంబినేషన్లపై ఆసక్తికర డిస్క‌ష‌న్స్ సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం బుచ్చిబాబు దృష్టి మొత్తం కొత్త కథపై ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఉప్పెన తర్వాత పెద్ది కోసం సంవత్సరాల సమయం తీసుకున్న బుచ్చిబాబు, ఇప్పుడ‌దే మార్గంలో నడవకూడదని నిర్ణయించుకున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. చిన్న బ్రేక్ తర్వాత పెద్ద ప్లానింగ్‌తో తిరిగి రంగంలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతుండటం, అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.