చెన్నైలో ఆ హీరో ఇంటికి బుచ్చిబాబు బాబు.. ఎమోషనల్ బాండింగ్
డైరెక్టర్ బుచ్చిబాబు సన మాటల్లో ఎప్పుడూ ఒక నాచురల్ ఫీల్ కనిపిస్తుంది. తాను తెరకెక్కించే సినిమాల్లోనే కాదు సాధారణంగా స్టేజ్ మీద మాట్లాడే ప్రతి మాటలోనూ ఆ ఎమోషన్ స్పష్టంగా తెలుస్తుంది.
By: M Prashanth | 31 May 2026 11:20 AM ISTడైరెక్టర్ బుచ్చిబాబు సన మాటల్లో ఎప్పుడూ ఒక నాచురల్ ఫీల్ కనిపిస్తుంది. తాను తెరకెక్కించే సినిమాల్లోనే కాదు సాధారణంగా స్టేజ్ మీద మాట్లాడే ప్రతి మాటలోనూ ఆ ఎమోషన్ స్పష్టంగా తెలుస్తుంది. లేటెస్ట్ గా చెన్నైలో జరిగిన పెద్ది ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన తీరు అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో రొటీన్ విషయాలు కాకుండా చెన్నై నగరంతో పాటు తన ఫేవరెట్ యాక్టర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. బుచ్చిబాబు మాట్లాడిన తీరు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది.
ఈ ప్రెస్ మీట్ లో బుచ్చిబాబు మాట్లాడుతూ తమిళనాడు రాజధాని చెన్నైతో తనకున్న స్పెషల్ బాండింగ్ గురించి ఎమోషనల్ గా చెప్పాడు. డైరెక్టర్ గా కెరీర్ స్టార్టింగ్ లో తన తొలి సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ గారితో వర్క్ చేసినప్పటి నుంచి ఈ నగరంతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందన్నాడు. ఇప్పుడు మరో లెజెండ్ ఏఆర్ రెహమాన్ గారితో కలిసి పనిచేస్తున్న టైమ్ లో కూడా అచ్చం అలాంటి పాజిటివ్ ఫీలింగే కలుగుతోందని తన మనసులోని మాటను ఓపెన్ గా బయటపెట్టాడు.
ఏదైనా సినిమా పని మీద చెన్నైకి వెళ్లడం అంటే తనకు ఒక కొత్త ఊరికి లేదా పరాయి ప్రాంతానికి వెళ్తున్న ఫీలింగ్ అస్సలు రాదని బుచ్చిబాబు పక్కా క్లారిటీ ఇచ్చాడు. సినిమా పని మీద తాను చెన్నై వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పేటప్పుడు ఏదో సొంతూరికి వెళ్తున్నంత హ్యాపీగా ఫీల్ అవుతానన్నాడు. ఆ మాట చెప్పేటప్పుడు తనలో ఒక తెలియని ఆనందం ఉంటుందని అన్నాడు. ఆ రేంజ్ లో ఈ నగరం తన లైఫ్ కు బాగా కనెక్ట్ అయిపోయిందని చెబుతూ మురిసిపోయాడు.
ఇదే వేదిక మీద తన ఫేవరెట్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి కూడా బుచ్చిబాబు కొన్ని క్రేజీ విషయాలు పంచుకున్నాడు. తన అభిమాన నటుడు విజయ్ సేతుపతి గారు కూడా ఈ చెన్నై నగరానికి చెందిన వారే కావడం తనకు మరింత ఆనందాన్ని ఇస్తుందని చెప్పాడు. డైరెక్టర్ గా తాను తెరకెక్కించిన మొట్టమొదటి సినిమాలో ఆయన ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించిన విషయాన్ని ఈ సందర్భంగా స్పెషల్ గా గుర్తుచేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయనతో మంచి స్నేహం ఏర్పడిందని అన్నాడు.
తన కెరీర్ మొదలైన తొలి రోజుల నుంచి విజయ్ సేతుపతి సార్ తనకు ఎంతో అండగా నిలబడ్డారని బుచ్చిబాబు అన్నాడు. తన ప్రతి అడుగులో ఆయన సపోర్ట్ ఎప్పుడూ తనతోనే ఉంటుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. తాను సినిమా పని మీద ఎప్పుడు చెన్నై నగరానికి వచ్చినా సరే విజయ్ గారు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి రా బుచ్చి అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తారని వివరించాడు. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా ఆయన చూపించే ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. ఇంత మంచి మనసున్న వ్యక్తులు ఉన్న చెన్నై నగరం అంటే తనకు ప్రాణం అని బుచ్చిబాబు తన స్పీచ్ ను హైలెట్ చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఎంతో స్వచ్ఛంగా మాట్లాడిన మాటలకు అక్కడి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తోటి వారితో మంచి బంధాన్ని మెయింటైన్ చేయడం వల్లే ఆయన సక్సెస్ అవుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
