Begin typing your search above and press return to search.

సినిమా చూసి భయపడ్డ బుచ్చిబాబు..ఇలా అయితే ఎలా సామీ!

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు బుచ్చి బాబు సన.

By:  Madhu Reddy   |   11 Sept 2025 12:04 PM IST
సినిమా చూసి భయపడ్డ బుచ్చిబాబు..ఇలా అయితే ఎలా సామీ!
X

బుచ్చిబాబు సనా.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నూతన నటీనటులతో తొలి పరిచయంలోనే వందకోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా.. కన్నడ బ్యూటీ కృతి శెట్టి తెలుగు తెరకు పరిచయమవుతూ.. తొలి పరిచయంలో వచ్చిన చిత్రం 'ఉప్పెన'. ఇదే సినిమాతో ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా పేరు సొంతం చేసుకున్న బుచ్చిబాబు సన డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. అలా తొలి ప్రయత్నంలోనే ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న బుచ్చిబాబు ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకొని.. ఏకంగా తన రెండవ సినిమా కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నే లైన్ లో పెట్టారు అంటే.. ఆయన వద్ద కథ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు బుచ్చి బాబు సన. ఒకవైపు తన సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూనే.. మరొకవైపు పలు సినిమా ఈవెంట్లకి కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిసారి హారర్ జానర్ లో చేస్తున్న చిత్రం 'కిష్కింధపురి'. ఇందులో ప్రముఖ మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే సెప్టెంబర్ 10న సాయంత్రం హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు బుచ్చిబాబు సన.

అందులో ఆయన ఒక సినిమా చూసి భయపడ్డాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు విషయంలోకి వెళ్తే.. కిష్కింధపురి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బుచ్చిబాబుతో యాంకర్ సుమా మాట్లాడుతూ.. "మీరు దేనికి భయపడతారు?" అంటూ ప్రశ్నించింది. దానికి బుచ్చిబాబు మాట్లాడుతూ.." నాకు దెయ్యం అంటే చాలా భయం. నేను తిరుచ్చినార్ లో ఉన్నప్పుడు చంద్రముఖి సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్లాను. అయితే రెండు కాళ్లు చెయిర్ లో పెట్టుకొని సినిమా మొత్తం చూశాను. అంత భయం నాకు. ఆ రోజు నైట్ 11:30 కి షో అయ్యింది. ఆ టైంలో నా ఫ్రెండ్ కు ఫోన్ చేసి.. రేయ్ మామా వస్తున్నాను రూమ్ డోర్ తెరిచి పెట్టు అని చెప్పాను. నా ఫ్రెండ్ రింగ్టోన్ ఏంటంటే చంద్రముఖి సినిమాలోని వారాయ్ అని పెట్టుకున్నాడు. ఇక అంతే.. రూమ్ దగ్గరకు వచ్చేసరికి వాడి రింగ్టోన్ విని మరింత భయపడిపోయాను. ఇలాంటివన్నీ మనకే తగులుతాయారా బాబు అని అప్పుడు మరింత భయం వేసింది" అంటూ దెయ్యం అంటే భయం అని చెప్పి తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు బుచ్చిబాబు సన.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరీ ఇలా అయితే ఎలా సామి.. నిజ జీవితంలో భయపడు.. కానీ సినిమాలు చూసి భయపడడం ఏంటి.. నువ్వు కూడా సినిమాలు చేస్తున్నావ్ కదా.. ఇదంతా ఒక కల్పనా అని తెలియదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ నువ్వే హారర్ జానర్ లో సినిమా చేయాల్సి వస్తే.. అప్పుడు ఏంటి పరిస్థితి అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా బుచ్చిబాబు చేసిన కామెంట్లకు చాలామంది ఆడియన్స్ నవ్వుకుంటున్నారు అనడంలో సందేహం లేదు.