Begin typing your search above and press return to search.

అక్కినేని కాంపౌండ్ లో బుచ్చిబాబు!

మ‌రి అఖిల్ తోనా? నాగార్జున‌తోనా? చైత‌న్య‌తోనా? ఆ సినిమా అంటే బుచ్చిబాబు త‌న హీరోగా అఖిల్ ని చూజ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   25 Feb 2026 7:00 PM IST
అక్కినేని కాంపౌండ్ లో  బుచ్చిబాబు!
X

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న `పెద్ది` క్లైమాక్స్ కు వ‌చ్చేసింది. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని ఈ స‌మ్మ‌ర్ లోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చేస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ద‌ర్శ‌కుడిగా బుచ్చిబాబుకిది రెండ‌వ చిత్రం. పాన్ ఇండియాలో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అనంత రం బుచ్చిబాబు ఏ హీరోతో సినిమా చేస్తాడు? అంటే అంతా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో అనే మాట వినిపిస్తోంది. ఈ విష‌యంలో బుచ్చిబాబు కూడా అంతే కాన్పిడెంట్ గా ఉన్నాడు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే రెండ‌వ సినిమా తార‌క్ తోనే అవ్వాలి.

కానీ స్టోరీ విష‌యంలో తార‌క్ అసంతృప్తితో సాధ్య‌ప‌డ‌లేదు. అప్ప‌టి నుంచి బుచ్చిబాబు `పెద్ది`తో పాటు ఖాళీ స‌మ‌యంలో తార‌క్ స్క్రిప్ట్ పైనే వ‌ర్క్ చేస్తున్నారు? అన్న‌ది కాద‌న‌లేని నిజం. మ‌రి మూడ‌వ చిత్రం తార‌క్ తో సాధ్య‌మేనా? కాద‌న్న‌ది తాజాగా అందుతోన్న స‌మాచారం. బుచ్చిబాబు ప్ర‌త్యామ్నాయం చూడ‌టంతోనే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్ త‌ర్వాత తార‌క్ ఏ డైరెక్ట‌ర్ తో సినిమా చేస్తాడు? అన్న దానిపై ఇటీవ‌లే క్లారిటీ వ‌చ్చేసింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ‌ర‌2` ప‌ట్టాలెక్కిస్తార‌ని తేలిపోయింది.

మ‌రి అంత వ‌ర‌కూ బుచ్చిబా బు ఖాళీగా ఉంటాడా? ఒక‌వేళ ఉండాల్సి వ‌స్తే ఏకంగా ఏడాదిన్న‌ర వ‌ర‌కూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ ఆలోచించే స‌మ‌యం ఎందుక‌ని ఈ మ‌ధ్య‌లోనే బుచ్చిబాబు మ‌రో హీరోతో సినిమా చేసే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో బుచ్చి అక్కినేని కాంపౌండ్ లోకి ఎంట‌ర్ అయ్యార‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీక్ అందింది. ఈ విష‌యంలో నాగార్జున కూడా లీడ్ తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. త‌మ హీరోల‌తో ఓ సినిమా చేయాల్సిందిగా నాగ్ కోరారుట‌. ఆయ‌న అడ‌గ‌డంతో బుచ్చిబాబు మారు మాట్లాడుకుంటా త‌ప్ప‌కుండా అంటూ క‌మిట్ అయ్యాడ‌ని తెలిసింది.

మ‌రి అఖిల్ తోనా? నాగార్జున‌తోనా? చైత‌న్య‌తోనా? ఆ సినిమా అంటే బుచ్చిబాబు త‌న హీరోగా అఖిల్ ని చూజ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అఖిల్ కి అయితే త‌న వ‌ద్ద ఓ స్క్రిప్ట్ సిద్దంగా ఉంద‌ని అన్నాడుట‌. తాను అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్న స‌మ‌యంలోనే ఓ యూత్ పుల్ ల‌వ్ స్టోరీ రాసుకున్నాడుట‌. ఆ క‌థ‌నే నేటి ట్రెండ్ కు త‌గ్గ‌ట్టు మార్పులు చేసి అఖిల్ తో తీస్తే బాగుంటుంద‌ని నాగార్జున‌తో చ‌ర్చిం చారుట‌. ఆ స్క్రిప్ట్ కు నాగ్ ఒకే చెప్పారా? లేదా? అన్న‌ది మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఇదే జ‌రిగితే? అఖిల్ కెరీర్ ట్రాక్ లో ప‌డే అవ‌కాశం ఉంది. `మోస్ట్ ఎలిజి బుల్ బ్యాచిల‌ర్` త‌ర్వాత అఖిల్ కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. ఆ త‌ర్వాత చేసిన సినిమాల‌న్నీ ప్లాప్ అయ్యాయి. ప్ర‌స్తుతం `లెనిన్` లో న‌టిస్తున్నాడు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇదే ఏడాది బుచ్చిబాబు-అఖిల్ కాంబో ప‌ట్టాలెక్కుతుంది.