Begin typing your search above and press return to search.

కె-పాప్ సామ్రాజ్యంలో 13 వసంతాల చారిత్రాత్మక ప్రయాణం!

ప్రపంచ సంగీత చరిత్రలో కొరియన్ పాప్ (కె-పాప్) శైలిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న ఏకైక బ్యాండ్ బిటిఎస్.

By:  Srikanth Kontham   |   12 Jun 2026 12:26 PM IST
కె-పాప్ సామ్రాజ్యంలో 13 వసంతాల చారిత్రాత్మక ప్రయాణం!
X

ప్రపంచ సంగీత చరిత్రలో కొరియన్ పాప్ (కె-పాప్) శైలిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న ఏకైక బ్యాండ్ బిటిఎస్. ఏడుగురు అసాధారణ ప్రతిభావంతులైన యువకులతో కూడిన కొరియన్ బ్యాండ్ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టి విజయవంతంగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల అభిమానులు బిటిఎస్ ఫెస్టా 2026 ను ఎంతో ఘనంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ ఉత్సవం వార్షికోత్సవంలా కాకుండా ఒక సాంస్కృతిక విప్లవానికి ప్రతీకగా నిలుస్తోంది.

2013 లో చిన్న మ్యూజిక్ ఏజెన్సీ ద్వారా ప్రస్థానాన్ని ప్రారంభించిన బిటిఎస్ నేడు గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్స్‌గా ఎదగడం వెనుక అద్భుతమైన పోరాటం ఉంది. భాషా సరిహద్దులను చెరిపేసి కొరియన్ భాషలోనే పాడుతూ అమెరికాలోని ప్రతిష్టాత్మక బిల్‌బోర్డ్ చార్టులను శాసించడం సామాన్యమైన విషయం కాదు. వారి పాటల్లోని సామాజిక సందేశాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన , యువతను ప్రేరేపించే సాహిత్యం ప్రపంచవ్యాప్త శ్రోతలను కట్టిపడేసాయి. ఈ 13 ఏళ్ల ప్రయాణంలో వారు సాధించిన గ్రామీ నామినేషన్లు, స్టేడియం టూర్‌లు తిరుగులేని ఆధిక్యతను చాటి చెబుతున్నాయి.

ప్రస్తుతం బిటిఎస్ సభ్యులు దేశ రక్షణ నిబంధనల ప్రకారం తప్పనిసరి సైనిక సేవలను పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నా? గ్రూప్ వార్షికోత్సవ ఉత్సాహం మాత్రం తగ్గలేదు. సైన్యంలో సేవలు అందిస్తున్నప్పటికీ అభిమానుల కోసం వారు ముందుగానే రికార్డ్ చేసి ఉంచిన ప్రత్యేక కంటెంట్, అన్‌రిలీజ్డ్ పాటలు , మ్యూజిక్ వీడియోలను ఫెస్టా సందర్భంగా విడుదల చేస్తున్నారు. తమకు , అభిమానులకు మధ్య ఉన్న బంధం కేవలం భౌతిక ఉనికికి మాత్రమే పరిమితం కాదని సంగీతం ద్వారా ఎల్లప్పుడూ ముడిపడి ఉంటుందని బిటిఎస్ సభ్యులు మరోసారి నిరూపించారు.

ఫెస్టా 2026 వేడుకలలో భాగంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు , సోషల్ మీడియా వేదికలు బిటిెస్ రంగు అయిన పర్పుల్ వర్ణంతో నిండిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్మీ అభిమానులు వివిధ నగరాల్లో సేవా కార్యక్రమాలు, మ్యూజిక్ స్ట్రీమింగ్ పార్టీలు , ఫ్యాన్ మీటింగ్‌లను నిర్వ‌హించి అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. బిటిఎస్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా పంచుకున్న భావోద్వేగ సందేశాలు అభిమానుల హృదయాలను హత్తుకుంటున్నాయి.

బిటిఎస్ సాధించిన ఈ 13 ఏళ్ల విజయం కేవలం వినోద రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి , ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సంస్కృతి వ్యాప్తికి అపారమైన బలాన్ని చేకూర్చింది. పాశ్చాత్య దేశాలు మాత్రమే శాసించే అంతర్జాతీయ సంగీత మార్కెట్‌లో ఆసియా ఖండానికి చెందిన ఒక బ్యాండ్ గ్లోబల్ రాయల్టీగా మారడం అనేది చలనచిత్ర , సంగీత చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టం.