Begin typing your search above and press return to search.

కత్తితో రెస్టారెంట్‌లో హ‌ల్చ‌ల్ చేసిన పాప్ స్టార్!

లాస్ ఏంజెల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో బ్రిట్నీ కత్తి పట్టుకుని అటు ఇటు తిరుగుతూ కనిపించిందనే వార్తలు సోషల్ మీడియాలో దావానాలా వ్యాపించాయి.

By:  Srikanth Kontham   |   15 May 2026 4:00 PM IST
కత్తితో రెస్టారెంట్‌లో హ‌ల్చ‌ల్ చేసిన పాప్ స్టార్!
X

పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ పేరు మరోసారి అంతర్జాతీయ మీడియాలో మారుమోగుతోంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో బ్రిట్నీ కత్తి పట్టుకుని అటు ఇటు తిరుగుతూ కనిపించిందనే వార్తలు సోషల్ మీడియాలో దావానాలా వ్యాపించాయి. దీంతో బ్రిట‌ట్నీ మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నెటిజన్లు రకరకాల పోస్టులు చేయడంతో విషయం వివాదంగా మారింది. అయితే ఈ ఆరోపణలను బ్రిట్నీ స్పియ‌ర్ ప్రతినిధి బృందం తీవ్రంగా ఖండించింది. ఇవ‌న్నీ పుకార్లు మాత్ర‌మేన‌ని ఎలాంటి నిజం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

దీనికి సంబంధించి బ్రిట్నీ స్పియర్స్ ప్రతినిధి స్పందించారు. `ఆ రోజు రెస్టారెంట్‌లో జరిగిన విషయాన్ని కొందరు కావాలనే తప్పుగా చిత్రీకరించారన్నారు. ఆమె భోజనం చేస్తున్న సమయంలో టేబుల్ పై ఉన్న కత్తిని సాదాసీదాగా ఉపయోగించిందని అంతేకానీ ఎవరినీ భయపెట్టడానికో లేదా అసహజంగా ప్రవర్తించడానికో ఆమె ప్రయత్నిం చలేదన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై నిరంతరం నిఘా ఉంచే వారు చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిట్నీ గతంలో తన ఇంట్లో కత్తులతో డాన్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే.

ఆ జ్ఞాపకాలతో ముడిపెట్టి తాజాగా రెస్టారెంట్ ఘటనను కూడా అదే కోణంలో ప్రజలు చూస్తున్నారని ఇంకొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బ్రిట్నీ ఎంతో ప్రశాంతంగా ఉందని జీవితాన్ని ఆస్వాదిస్తోందని తెలిపారు. లేనిపోని పుకార్లను సృష్టించి మానసిక ఒత్తిడికి గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. లాస్ ఏంజెల్స్ వంటి నగరాల్లో ప్ర‌జ‌లు తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల సెలబ్రిటీలు స్వేచ్ఛగా బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. బ్రిట్నీ వంటి గ్లోబల్ స్టార్స్ ప్రతి కదలికను కెమెరాల్లో బంధించి వాటికి మసాలా జోడించి వార్తలుగా మార్చడం ట్రెండ్‌గా మారిందని అభిమానులు మండిప‌డుతున్నారు.

ఈ క్రమంలోనే కత్తి వివాదం కూడా పుట్టుకొచ్చిందని మద్దతుదారులు వాదిస్తున్నారు. బ్రిట్నీ చేసే ప్రతి చిన్న పనిని ప్రపంచం భూతద్దంలో పెట్టి చూడటం వల్ల ఆమెపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆమె ప్రతినిధి ఇచ్చిన వివరణతో వివాదానికి తెరపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని కోరుతున్నారు. గ్లామర్ ప్రపంచంలో ఉండే వారు అనుక్షణం నిఘా నీడలో ఉండ‌టం ఎంతటి కష్టమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. బ్రిట్నీ వ్య‌క్తిగ‌త‌ స్వేచ్ఛను ఆస్వాదిస్తూ మరింత ఆరోగ్యంగా ఉండాలని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.