Begin typing your search above and press return to search.

రివాల్వర్- బ్లేడ్‌ తో సుదీప్.. 'బిల్లా రంగ బాషా'పై హైప్ మరింతగా..

సాధారణ యాక్షన్ హీరోలా కాకుండా యుద్ధాల్లో దిట్టైన యోధుడిగా సుదీప్ కనిపించడం సినిమాపై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.

By:  M Prashanth   |   26 Jun 2026 12:10 AM IST
రివాల్వర్- బ్లేడ్‌ తో సుదీప్.. బిల్లా రంగ బాషాపై హైప్ మరింతగా..
X

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ బిల్లా రంగ బాషా (BRB): ఫస్ట్ బ్లడ్ షూటింగ్ కు అంతా రెడీ అయింది. శుక్రవారం నుంచి.. అంటే జూన్ 26వ తేదీన షూటింగ్ మొదలవుతున్నట్లు తాజాగా మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. యుద్ధ గాయాలతో, రఫ్ లుక్‌ లో, చేతిలో ప్రత్యేకమైన రివాల్వర్- బ్లేడ్ ఆయుధంతో కనిపించిన సుదీప్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

విక్రాంత్ రోణ తర్వాత దర్శకుడు అనూప్ భండారి, కిచ్చా సుదీప్ కాంబినేషన్‌ లో వస్తున్న మరో గ్రాండ్ మూవీ ఇదే కావడం విశేషం. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ రూపొందుతున్న ఆ సినిమాను భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్నారు. హనుమాన్ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ మూ్వీని నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తమ ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ వీడియో సినిమాపై పెద్ద ఎత్తున ఆసక్తి రేకెత్తించింది. క్రీ.శ. 2209 నేపథ్యంలో కథ సాగుతున్నట్లు అందులో చూపించారు. ప్రపంచంలోని ప్రముఖ కట్టడాలు ధ్వంసమైన తర్వాత ఏర్పడిన కొత్త వరల్డ్ ను, దానిపై ఒక పవర్ ఫుల్ వ్యక్తి డామినేషన్ ను ఇంట్రెస్టింగ్ చూపించారు. ఫ్యూచర్ వరల్డ్ ను మూడు విభిన్న మోడ్స్ లో చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా విడుదలైన పోస్టర్ కూడా అదే ప్రపంచాన్ని రిఫ్లెక్ట్ చేస్తోంది. సాధారణ యాక్షన్ హీరోలా కాకుండా యుద్ధాల్లో దిట్టైన యోధుడిగా సుదీప్ కనిపించడం సినిమాపై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ముఖ్యంగా ఆయన చేతిలో ఉన్న రివాల్వర్-బ్లేడ్ ఆయుధం పోస్టర్‌ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

అయితే సినిమాపై దర్శకుడు అనూప్ భండారి కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. విక్రాంత్ రోణ తర్వాత మరోసారి సుదీప్‌ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సినిమాను రూపొందిస్తున్నామని ఆయన గతంలో వెల్లడించారు. నిర్మాతలు కూడా కథ విన్న వెంటనే నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భారీ స్థాయిలో నిర్మించాలన్న తమ ఆలోచనకు బిల్లా రంగ బాషా సరైన కథగా అనిపించిందని వెల్లడించారు.

అదే సమయంలో ఇప్పుడు షూటింగ్ ప్రారంభం కావడంతో ఆ ప్రాజెక్ట్ అధికారికంగా సెట్స్‌ పైకి వెళ్లింది. ఇప్పటికే కాన్సెప్ట్ వీడియో, పోస్టర్లతో భారీ హైప్ తెచ్చుకున్న ఆ సినిమా, షూటింగ్ ప్రారంభం తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌ తో అభిమానులను అలరించే అవకాశం కచ్చితంగా ఉంది. అన్ని మెయిన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదల కానున్న ఆ పాన్ ఇండియా మూవీతో కిచ్చా సుదీప్ మరోసారి ఆకట్టుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.