బ్రహ్మోత్సవం ఫ్లాప్ కాదు.. లాభాలపై నిర్మాత క్లారిటీ!
కొన్ని కొన్ని చిత్రాలు కథ ఎంత బాగున్నా.. థియేటర్లలోకి వచ్చేసరికి ఏదో ఒక సందర్భంలో ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోతే అది కచ్చితంగా డిజాస్టర్ గానే మిగులుతుంది.
By: Madhu Reddy | 12 Dec 2025 11:14 AM ISTకొన్ని కొన్ని చిత్రాలు కథ ఎంత బాగున్నా.. థియేటర్లలోకి వచ్చేసరికి ఏదో ఒక సందర్భంలో ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోతే అది కచ్చితంగా డిజాస్టర్ గానే మిగులుతుంది. అయితే అలాంటి చిత్రాలు మళ్లీ టీవీల్లో ప్రసారమైతే మాత్రం వాటికి మంచి టీఆర్పీ రేటింగ్ ను కట్టబెడుతూ ఉంటారు ఆడియన్స్. అలా థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచి.. టీవీలలో సత్తా చాటిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకొని.. లాభాల వర్షం కురిపించిన చిత్రాలు కూడా లేకపోలేదు. అలాంటి చిత్రాలలో మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమా కూడా ఒకటి. నిజానికి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు కానీ ఇది మాత్రం ఫ్లాప్ కాదు అని, లాభాల వర్షం కురిపించింది అని నిర్మాత చెప్పుకొచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పొట్లూరి ప్రసాద్, ఘట్టమనేని మహేష్ బాబు నిర్మాణంలో 2016 లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం బ్రహ్మోత్సవం. దాదాపు 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నిజానికి సమంత , జయసుధ, కాజల్, ప్రణీత సత్యరాజ్ ఇలా ఎంతోమంది భారీ తారాగణం ఒకే సినిమాలో కనిపించి, అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భారీ తారాగణం మాత్రమే కాకుండా ఇందులోని పాత్రలు కూడా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. కానీ పలు కారణాలవల్ల ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఇక ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో చాలామంది మహేష్ అభిమానులు, ప్రేక్షకులు ఆఖరికి విమర్శకులు కూడా డైరెక్టర్ పై విమర్శలు గుప్పించారు.. అసలు డైరెక్టర్ కు ఇంత అందమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీని తెరపై చూపించడానికి సాధ్యపడలేదు అంటూ ఎన్నో ట్రోల్స్ కూడా చేశారు. అయితే దీనిపై మహేష్ బాబు స్పందించారు కూడా.. బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ కావడానికి దర్శకుడిని నిందించవద్దు.. ఎందుకంటే నేనే బాధ్యత వహించాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చిత్రానికి దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలను ఎంచుకోవడం అనేది పూర్తిగా నా ఎంపిక మాత్రమే. ఆయన డైరెక్షన్లో ఎటువంటి లోపం లేదు. నా తీర్పులోనే పొరపాటు ఉంది" అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. మొత్తానికైతే తన వైఫల్యాన్ని అంగీకరించడంతో ఆయన గొప్ప మనసుకు అప్పట్లో ప్రశంసలు కూడా కురిసాయి.
అలా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న బ్రహ్మోత్సవం సినిమా ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రం నిర్మాత ఈ సినిమా ఫ్లాప్ కాదని.. లాభాల వర్షం కురిపించింది అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. విషయంలోకి వెళ్తే.. ఈ చిత్రం నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవం సినిమా అందరూ ఫ్లాప్ అన్నారు. కానీ ఈ చిత్రం ద్వారా నాకు ఐదు కోట్ల లాభం వచ్చింది అంటూ ఆయన స్పష్టం చేశారు. మొత్తానికైతే ఇన్ని రోజులు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఏకంగా ఐదు కోట్లు లాభం వచ్చిందని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఇటు టీవీలో మంచి టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే.
