Begin typing your search above and press return to search.

బ్రహ్మగా హాస్య బ్రహ్మ.. ఈసారి డివైన్ మిస్టరీ సెటప్

సుమంత్ హీరోగా నటిస్తున్న మిథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి. సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది.

By:  M Prashanth   |   16 Aug 2026 12:32 PM IST
బ్రహ్మగా హాస్య బ్రహ్మ.. ఈసారి డివైన్ మిస్టరీ సెటప్
X

సుమంత్ హీరోగా నటిస్తున్న మిథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి. సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. రిలీజ్ కు ఇంకా నెల రోజుల కంటే తక్కువే టైమ్ ఉండటంతో మేకర్స్ ఫైనల్ ఫేజ్ ప్రమోషన్స్ గట్టిగా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం క్యారెక్టర్ కు సంబంధించిన ఒక వీడియోను అఫీషియల్ గా రివీల్ చేశారు.

బ్రహ్మానందాన్ని ముద్దుగా హాస్య బ్రహ్మ అనే ట్యాగ్ సొంత చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరును కూడా మేకర్స్ బ్రహ్మ గానే లాక్ చేయడం హైలెట్. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియోలో ఆయన దేవి వారాహిని చాలా భక్తితో ప్రార్థిస్తూ కనిపించారు. అమ్మ వారాహి మా మహేంద్రగిరిని కాపాడు తల్లీ అంటూ ఆయన ఆవేదనగా చెప్పిన డైలాగ్ ఎమోషనల్ గా ఉంది.

మేకోవర్ కూడా చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తోంది. సాధారణంగా స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు ఆటోమేటిక్ గా నవ్వేస్తుంటాం. కానీ ఈ క్యారెక్టర్ గ్లింప్స్ చూస్తే మాత్రం ఆ ఫీలింగ్ అస్సలు రాదు. ఇందులో ఆయన రోల్ కి కామెడీకి ఎలాంటి సంబంధం లేదని వీడియోలోని సీరియస్ నెస్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతోంది. ఒక డివైన్ మిస్టరీ సెటప్ లో ఆయన పాత్రను చాలా ఎమోషనల్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ నవ్వించిన బ్రహ్మీలోని ఇంకో కొత్త కోణాన్ని డైరెక్టర్ చూపించబోతున్నాడు.

హాస్య బ్రహ్మను బ్రహ్మ అనే పాత్రతోనే తెర మీద ప్రెజెంట్ చేయడం నిజంగా ఒక హైలెట్ అయ్యే పాయింట్. అయితే ఆ పేరు వెనక ఇంకేదైనా పెద్ద మిస్టరీ ఉందా అనేది మాత్రం టీమ్ ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. కథలో ఆయనకు ఏమైనా శక్తులు ఉన్నాయా అన్నది కూడా సస్పెన్స్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఈ సినిమా ప్రపంచానికి పెద్ద ప్లస్ అవుతుంది.

ఇప్పటిదాకా వదిలిన కంటెంట్ ను గమనిస్తే సినిమా అంతా మహేంద్రగిరి అక్కడి వారాహి అమ్మవారి ఆలయం కొన్ని పురాతన రహస్యాల చుట్టూ సాగుతుందని మేకర్స్ హింట్స్ ఇచ్చారు. ఈ సినిమాలో సుమంత్ తో పాటు ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల లాంటి స్ట్రాంగ్ కాస్టింగ్ ఉంది. ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ కాన్సెప్ట్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.