Begin typing your search above and press return to search.

బ్రహ్మి చెప్పిన A-B ఫార్ములా!

తాజాగా నిర్వహించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు అంద‌రినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మానందం, తనకు ఎంతో ఆప్తులైన సహనటులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 March 2026 1:18 PM IST
బ్రహ్మి చెప్పిన A-B ఫార్ములా!
X

తెలుగు సినీ పరిశ్రమలో నవ్వుల రాజుగా పేరుగాంచిన బ్ర‌హ్మానందం మరోసారి తన స్పెష‌ల్ టైమింగ్ తో అందరినీ అలరించారు. తాజాగా నిర్వహించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు అంద‌రినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మానందం, తనకు ఎంతో ఆప్తులైన సహనటులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నా కన్నా సీనియర్ నటుడు అలీ ఈ సినిమాలో నటించాడు. A అంటే అలీ, B అంటే బ్రహ్మానందం. A-B లు ఎలా ఉంటాయో… మా విల్లాస్ కూడా 34-36 పక్కపక్కనే ఉంటాయి” అన్నారు. బ్ర‌హ్మానందం వ్యాఖ్య‌ల త‌ర్వాత స్టేజ్ కింద నుంచి C అంటే చిత్రం శ్రీను అని కూడా చెప్పండ‌న‌గా, D తో ఎవ‌రూ లేరా అని అన‌డంతో తన మాటల్లో చమత్కారం, అనుభవం, సహనటులపై ఉన్న స్నేహభావం స్పష్టంగా కనిపించాయి.

బ్ర‌హ్మి, అలీ క‌ల‌యిక‌లో ఎన్నో సినిమాలు

కాగా బ్రహ్మానందం, అలీతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగు సినీ రంగంలో వీరిద్దరి కాంబినేషన్ అనేకసార్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ నేపథ్యంలో అలీ గురించి ప్రస్తావించడం, A-Bల పోలికతో చేసిన వ్యాఖ్య ఈ ఈవెంట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో శివాజీ నటించిన పలు సినిమాల్లో కూడా తాను కలిసి నటించానని బ్రహ్మానందం గుర్తుచేసుకున్నారు. శివాజీతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఆయనతో పనిచేసిన అనుభవం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు.

ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌స్తున్న సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ధ‌పూస‌ని

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి తెరపై కనిపించబోతున్న శివాజీ, ల‌య జంటపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన సాంప్రదాయిని సుప్పిని సుద్ధ‌పూసని సినిమా ఎమోష‌న్స్, వినోదం కలగలిపిన ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో యువ నటుడు రోహ‌న్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం వ‌చ్చి, ఆయ‌న మాట్లాడిన మాట‌లు, చిత్ర యూనిట్ కు ఇచ్చిన కాన్ఫిడెన్స్ టీమ్‌లో మంచి ఉత్సాహాన్ని నింపాయి. ఆయన మాటల్లో కనిపించిన అనుబంధం, సీనియారిటీపై చూపిన గౌరవం, సహనటులపై వ్యక్తపరిచిన అభిమాన భావం సినీ కుటుంబంలో ఉన్న స్నేహబంధాన్ని మరోసారి గుర్తు చేసింది. ముఖ్యంగా A-Bల పోలికతో చెప్పిన విష‌యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొత్తానికి, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నవ్వులు, జ్ఞాపకాలు, అనుబంధాలతో సాగింది. బ్రహ్మానందం వంటి దిగ్గజ నటుడు వేదికపై చేసిన చిన్న వ్యాఖ్య కూడా ఎలా పెద్ద చర్చకు దారి తీస్తుందో ఈ కార్యక్రమం మరోసారి నిరూపించింది. సినిమా రిలీజ్ కు ముందు ఇలాంటి సానుకూల వాతావరణం నెలకొనడం టీమ్‌కు శుభసూచకంగా మారిందని చెప్పవచ్చు. సుధీర్ శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ధ‌పూస‌ని మూవీ మార్చి 6న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.