కాంతార చాప్టర్ 1 నుండీ "బ్రహ్మకలశ" సాంగ్ రిలీజ్.. దైవత్వంతో!
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వహిస్తున్న ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా మంచి హైప్ అయితే ఉంది.
By: Madhu Reddy | 28 Sept 2025 11:49 AM ISTరిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి నటించిన తాజా మూవీ కాంతార:చాప్టర్ 1.. 2022లో విడుదలైన కాంతార మూవీకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్:1 సినిమా తెరకెక్కిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కాంతార మూవీ విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. రూ.300 కోట్ల కి పైగా కలెక్షన్లు కొల్లగొట్టి అద్భుతమైన హిట్ సాధించడంతో ఈ సినిమా ప్రీక్వెల్ పై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసింది.. 'బ్రహ్మ కలశ' అనే ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడంతో ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దైవత్వంతో నిండిన ఈ పాటకి అభిమానులు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యనే విడుదలైన కాంతార చాప్టర్:1 ట్రైలర్ కూడా అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన స్వయంగా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా వహిస్తున్న ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా మంచి హైప్ అయితే ఉంది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం హైదరాబాదులోని జేఆర్సి కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నట్టు ఇప్పటికే మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలా ఒకే వేదికపై రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్టీఆర్ లను చూడబోతున్నాం.
కాంతార సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన రిషబ్ శెట్టి మంచి మంచి కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. కాంతార, కాంతార చాప్టర్:1 తో ఫేమస్ అయిన ఈయన త్వరలోనే హను-మాన్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాతో పాటు మరాఠీలు దైవంగా కొలిచే మరాఠీ మహారాజ్ శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే సినిమాలో ఛత్రపతి శివాజీ గా కనిపించబోతున్నారు. మొత్తానికైతే అటు వరుస చిత్రాలలో నటిస్తూనే ఇటు వరుస చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు రిషబ్ శెట్టి. ఇప్పుడు రాబోతున్న కాంతార చాప్టర్ 1 సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
