తెలుగు ఆడియన్స్ మనసు గెలిచిన హాలీవుడ్ సినిమా..?
ఇక లేటెస్ట్ గా అమెరికన్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఎఫ్ 1 సినిమా థియేట్రికల్ వెర్షన్ సక్సెస్ అందుకుంది.
By: Ramesh Boddu | 30 Aug 2025 10:27 AM ISTతెలుగు ఆడియన్స్ కి ఒక సినిమా నచ్చితే అది స్పెషల్ డిస్కషన్ గా ఉంటుంది. సినిమాలో ఏమాత్రం విషయం ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయం కేవలం మన ఇండియన్ సినిమాలకే కాదు హాలీవుడ్ సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఇండియా లెవెల్ లో హాలీవుడ్ సినిమాల మార్కెట్ ఒక ఎత్తైతే.. తెలుగులో మరో ఎత్తు అనిపించేలా ఉంటుంది. అదంతే తెలుగు ఆడియన్స్ కి ఒక సినిమా నచ్చితే అది హాలీవుడ్ సినిమా అయినా.. యానిమేటెడ్ సినిమా అయినా చూసేస్తారు.
హాలీవుడ్ స్పోర్ట్స్ మూవీ ఎఫ్ 1..
ఈ క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన ఒక హాలీవుడ్ స్పోర్ట్స్ మూవీని తెలుగు ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు. ఇండియన్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే కొన్ని హాలీవుడ్ సినిమాలు మన దగ్గర భారీగా రిలీజ్ చేస్తారు. ఐతే మార్కెట్ మరింత పెంచుకునేందుకు తెలుగు, తమిళం ఇలా ప్రాంతీయ భాషలకు డబ్బింగ్ చెప్పిస్తారు. అలా డబ్బింగ్ చెప్పిన సినిమాలతో కూడా రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి.
ఇక లేటెస్ట్ గా అమెరికన్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఎఫ్ 1 సినిమా థియేట్రికల్ వెర్షన్ సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ బాగా ఆదరించారు. తెలుగులో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. థియేట్రికల్ వెర్షన్ అయిపోయింది. లేటెస్ట్ గా ఎఫ్ 1 సినిమా ఓటీటీ రిలీజైంది. అక్కడ కూడా ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు తెలుగు ఆడియన్స్.
ఓటీటీలో సూపర్ రెస్పాన్స్..
అంటే ఒక సినిమా బాగుంది అంటే అది ఏ ఫ్లాట్ ఫాం లో వచ్చినా దాన్ని ఆదరిస్తారన్నమాట. ఎఫ్ 1 తెలుగులో థియేట్రికల్ హిట్ అవ్వడమే కాదు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ప్రెజంట్ సోషల్ మీడియాలో ఎఫ్ 1 సినిమా గురించే డిస్కషన్ జరుగుతుంది. బ్రాడ్ పిట్ నటించిన ఈ సినిమాను జోసెఫ్ కోసిన్స్ కి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు ఎహ్రెన్ క్రుగర్ స్క్రీన్ ప్లే అందించారు.
ఫార్ములా 1 రేసింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన ఫీట్లు.. ఆశ్చర్యపరిచే సాహస విన్యాసాలతో యాక్షన్ ప్రియులకు మంచి ఫీస్ట్ ఇచ్చింది. ఐతే తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఆదరించడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఫార్ములా 1 రేసింగ్ కథతో ఇలా విజువల్ ఫీస్ట్ అందించడం ఇక్కడ ఆడియన్స్ కి బాగా నచ్చింది. అందుకే థియేట్రికల్ వెర్షన్ హిట్ చేయడమే కాదు ఇప్పుడు ఓటీటీ రిలీజైనా కూడా తెగ చూసేస్తున్నారు. ఎఫ్ 1 సినిమా అమెజాన్ ప్రైం వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
