Begin typing your search above and press return to search.

ఎఫ్ 1 సినిమా.. ఆ విషయంలో ఫీల్ అవుతున్న ఫ్యాన్స్

ఇటీవల హాలీవుడ్ నుంచి రిలీజైన లేటెస్ట్ ఎఫ్ 1 మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించారు.

By:  M Prashanth   |   23 Aug 2025 1:48 PM IST
ఎఫ్ 1 సినిమా.. ఆ విషయంలో ఫీల్ అవుతున్న ఫ్యాన్స్
X

ఇటీవల హాలీవుడ్ నుంచి రిలీజైన లేటెస్ట్ ఎఫ్ 1 మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించారు. అమెరికన్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ కోసిన్స్కి ఈ సినిమాను రేస్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఇండియాలోనూ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. మన తెలుగు సెలబ్రిటీలు సైతం థియేటర్లలోకి వెళ్లి మరీ సినిమా చూశారు.

అయితే థియేటర్ లలో భారీ హిట్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. తాజాగా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. థియేటర్ రన్ అయ్యాక చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో భారీ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. కానీ, ప్రేక్షకులు మాత్రం ఫీల్ అవుతున్నారు.

కానీ, ఈ సినిమా ఓటీటీ విషయంలో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సినిమా భారీ విజయం అందుకున్నప్పటికీ ఈ సినిమాను ఓటీటీలో చూసిన తర్వాత మూవీ లవర్స్ బాధపడుతున్నారు. అనవసరంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయ్యామని ఫీల్ అవుతున్నారు. ఓటీటీలోనే ఈ రేంజ్ ఫీల్ ఉంటే.. థియేటర్లలో చూసి ఉంటే ఆ అనుభూతి వేరే లెవెల్ ఉండేదని.. కానీ ఆ ఎక్స్ పీరీయన్స్ మిస్ అయ్యామని అంటున్నారు.

ఇక రెగ్యులర్ థియేటర్ లలో కాకుండా డాల్బీ అట్మాస్, 3డీ, ప్రీమియం స్క్రీన్ లలో ఎఫ్ 1 చూసి ఉంటే నిజమైన థ్రిల్ పొందేవాళ్లమోనని థియేటర్ లలో మిస్ అయిన ప్రేక్షకులు అంటున్నారు. ఏదైమైనా బ్రాడ్ పిట్ ఎఫ్ 1 సినిమాకు అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇప్పటికీ ఎక్కడైనా థియేటర్లలో సినిమా ఆడితే.. చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అవకాశం లేని వాళ్లు ఓటీటీతోనే అడ్జస్ట్ అవుతున్నారు.

ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సెన్సేషనల్ హిట్ అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఇది ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా యునైటెడ్ స్టేట్స్, కెనడాలో 183 మిలియన్ డాలర్లు, ఇతర ప్రాంతాలలో 408 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 591 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.