హీరొయిన్ ను పెళ్లి చేసుకున్నందుకు హాలీవుడ్ హీరో పశ్చాత్తాపం
2016లో ఏంజెలీనా జోలీ విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత మొదలైన న్యాయపోరాటంలో పిల్లల కస్టడీ ప్రధాన అంశంగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 31 Aug 2026 7:00 PM ISTహాలీవుడ్‌లో ఒకప్పుడు ఆదర్శ జంటగా కనిపించిన బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ కథ ఇప్పుడు ప్రేమకథ కంటే సుదీర్ఘమైన కుటుంబ, న్యాయపోరాటానికి ప్రతీకగా మారింది. దాదాపు దశాబ్దం పాటుగా కొనసాగుతున్న ఈ వివాదం ఆస్తులు, పిల్లల కస్టడీ వంటి అంశాలను దాటి.. కుటుంబ సంబంధాలపైనే తీవ్ర ప్రభావం చూపినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
2016లో ఏంజెలీనా జోలీ విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత మొదలైన న్యాయపోరాటంలో పిల్లల కస్టడీ ప్రధాన అంశంగా మారింది. ఆ తర్వాత ఇరువైపుల నుంచి పలు ఆరోపణలు, ప్రత్యారోపణలు వెలువడ్డాయి. ముఖ్యంగా 2016 విమాన ప్రయాణానికి సంబంధించిన ఆరోపణలను బ్రాడ్ పిట్ ఖండించారు. ఈ ఆరోపణలు కోర్టు, మీడియా డిస్కషన్స్‌లో భాగమైనప్పటికీ.. వాటిని నిర్ధారిత వాస్తవాలుగా చూడటం సరికాదు. 2024లో వీరి విడాకుల పరిష్కారం పూర్తైనప్పటికీ, కుటుంబ విభేదాల ప్రభావం మాత్రం పూర్తిగా ముగిసినట్లు కనిపించడం లేదు.
ఇటీవల వారి విషయంలో మరో పరిణామం చర్చనీయాంశమైంది. బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీల కుమార్తె వివియెన్ తన పేరులోని పిట్ ను తొలగించుకునేందుకు లీగల్ ప్రాసెస్ ను స్టార్ట్ చేసింది. అంతకుముందు షిలో తన పేరును షిలో జోలీగా మార్చుకుంది. జహారా, మాడాక్స్ కూడా పిట్ ఇంటిపేరును తొలగించుకునే ప్రక్రియలో ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ డెసిషన్స్ వెనుక గల అసలు కారణాలను వారు అధికారికంగా వెల్లడించలేదు.
ఇక్కడే బ్రాడ్ పిట్‌కు ఎదురైన నష్టం కేవలం ఆస్తులు, వ్యాపార వివాదాలకు పరిమితం కాలేదనే డిస్కషన్ మొదలవుతోంది. తన పిల్లలతో ఏర్పడిన దూరం ఆయనకు అత్యంత బాధాకరమైన అంశంగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు, పిల్లలను తనకు దూరం చేయడంలో ఏంజెలీనా జోలీ పాత్ర ఉందని కూడా పిట్ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి జోలీ వైపు నుంచి భిన్నమైన వాదనలు ఉన్నాయి. అందువల్ల ఈ అంశాన్ని ఏకపక్షంగా చూడటం కష్టం.
ఇటీవల తన జీవితంలోని అత్యంత క్లిష్ట దశ గురించి మాట్లాడిన బ్రాడ్ పిట్, విడాకులు, కుటుంబ సమస్యలు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని వెల్లడించారు. ఆ సమయంలో తాను తీవ్రమైన నిరాశను అనుభవించానని, అసలు ఏంజెలీనా జోలీని పెళ్లి చేసుకోవడమే తన లైఫ్ లో జరిగిన అతిపెద్ద పొరపాటు అంటూ పిట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు ప్రపంచం మెచ్చిన బ్రాంజెలీనా.. చివరకు ఆస్తుల కంటే కుటుంబ బంధాలనే ఎక్కువగా కోల్పోయిన కథగా మిగిలిందా అన్న ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.
